వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

భారతీయుడు 2 ప్రమాదంతో భారీ మార్పులు.. డైరెక్టర్ శంకర్ సంచలన కామెంట్లు..

|
Google Oneindia TeluguNews

ప్రతిష్టాత్మక భారతీయుడు 2 సినిమా షూటింగ్ లో క్రేన్ ప్రమాదం ఘటన ఫిలిం ఇండస్ట్రీని నిర్ఘాతపర్చింది. గతవారం చెన్నై శివారులో జరిగిన ప్రమాదంలో యూనిట్ లోని ముగ్గురు చనిపోగా, 10 మందికి గాయపడటం, హీరో కమల్ మృతుల కుటుంబాలకు మూడు కోట్ల పరిహారం ప్రకటించడం, ప్రమాద ఘటనపై ఎవరూ ఫిర్యాదు చేయనప్పటికీ.. చెన్నై పోలీసులు సుమోటోగా కేసు నమోదు చేసుకోవడం తెలిసిందే.

ఇండియన్ 2 క్రేన్ ప్రమాద ఘటనపై సెంట్రల్ క్రైమ్ బ్రాంచ్ డీసీపీ నాగజ్యోతి ఆధ్వర్యంలో దర్యాప్తు సాగుతున్నది. ఇప్పటికే పలువురిని ప్రశ్నించిన ఆమె, ఒకటిరెండురోజుల్లో హీరో కమల్, దర్శకుడు శంకర్ ను కూడా విచారించనున్నారు. ఇదిలా ఉంటే ఇండియన్ 2 క్రేన్ ప్రమాద ఘటన తర్వాత కోలీవుడ్ లో భారీ మార్పులు చోటుచేసుకుంటున్నాయి. నిర్మాతలందరూ తమ సినిమా సెట్లు, యూనిట్ మెంబర్ల సేఫ్టీఫై ఫోకస్ పెంచారు. శింబు హీరోగా రూపొందుతోన్న 'మానాడు' సినమాకు పనిచేస్తున్న సిబ్బంది, సెట్టింగ్ లకు నిర్మాత బీమా తీసుకున్నారు.

 after Indian 2 crane mishap tamil producers looking for insuring their films, Shankar’s emotional tweet

క్రేన్ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్న దర్శకుడు శంకర్.. ఘటనపై వారం తర్వాత స్పందించారు. తానింకా షాక్ లోనే ఉన్నానని, ఆ క్రేన్ తనపైన పడినా బాగుండేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ''బరువెక్కిన గుండెతో ఈ మాటలు రాస్తున్నాను.. ప్రమాదం జరిగినప్పటి నుంచి నేను షాక్ లోనే ఉండిపోయా.. నా పక్కనే కూర్చున్న అసిస్టెంట్ అలా మరణించడాన్ని చూసిన తర్వాత నాకు నిద్రకూడా పట్టడంలేదు.. వెంట్రుకవాసిలో బతికిపోయినప్పటికీ.. ఆ క్రేన్ నా మీద పడినా బాగుండేదేమో అనిపిస్తోంది.. బాధిత కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి..''అని శంకర్ రాసుకొచ్చారు.

English summary
days after Indian 2 mishap, director Shankar’s emotional tweet goes viral. several producers in tamil film industry weigh in on safety measures
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X