వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శశికళ, దినకరన్ మెడకు జయ కొడనాడు ఎస్టేట్ హత్య కేసు ? విచారణకు సిద్దం !

జయలలిత కొడనాడు ఎస్టేట్ హత్య, చోరీ కేసు దర్యాప్తు పూర్తి చెయ్యాలంటే శశికళ, టీటీవీ దినకరన్ లను విచారించాలని పోలీసు అధికారులు సిద్దం అయ్యారు. ఈ విషయంపై ఉన్నతాధికారులతో చర్చించి వారిని విచారణ చెయ్యాలని అధ

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత కొడనాడు ఎస్టేట్ లో జరిగిన హత్య కేసు క్రైం సినిమాను తలతన్నే విధంగా తయారైయ్యింది. ఈ హత్య కేసు దర్యాప్తు రోజుకో మలుపు తిరగడంతో పోలీసులు తలపట్టుకుంటున్నారు.

షాక్: సీఎం పబ్లిక్ మీటింగ్ కు వంద మంది: పన్నీర్ సెల్వం మీటింగ్ కు లక్ష మంది !షాక్: సీఎం పబ్లిక్ మీటింగ్ కు వంద మంది: పన్నీర్ సెల్వం మీటింగ్ కు లక్ష మంది !

కొడనాడు ఎస్టేట్ హత్య కేసులో ప్రధాన నిందితుడైన జయలలిత మాజీ కారు డ్రైవర్ కనకరాజ్ రోడ్డు ప్రమాదంలో అనుమానాస్పదస్థితిలో మరణించాడు. ద్వితీయ సూత్రధారి సయాన్ మరో రోడ్డు ప్రమాదంలో తీవ్రగాయాలై కోయంబత్తూరులోని ఆసుపత్రిలో ఐసీయూలో మృత్యువుతో పోరాడుతున్నాడు. ఆ కేసులో సయాన్ సాక్షం కీలకంగా మారిందని పోలీసు అధికారులు అంటున్నారు.

సయాన్ కీలక సాక్షి

సయాన్ కీలక సాక్షి

జయలలిత కొడనాడు ఎస్టేట్ లో సెక్యూరిటీ గార్డు హత్య కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసు అధికారులు ద్వితీయ సూత్రధారి సయాన్ మీద ఆదారపడి ఉన్నారు. అతను కోలుకుంటేనే ఈ కేసు చిక్కుముడి వీడుతుందని పోలీసులు భావిస్తున్నారు.

ఆసుపత్రిలో సయాన్ పై హత్యాయత్నం !

ఆసుపత్రిలో సయాన్ పై హత్యాయత్నం !

కోయంబత్తూరులోని సయాన్ చికిత్స పొందుతున్న ప్రయివేటు ఆసుపత్రి గోడదూకిన ఓ 25 ఏళ్ల యువకుడు ఐసీయూలో ఉన్న నిందితుడిని హత్య చెయ్యడానికి ప్రయత్నించాడు. విషయం గుర్తించిన పోలీసులు అతని వెంటపడ్డారు. పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ఆయువకుడు ప్రయత్నించాడు.

చంపడానికి వచ్చి కోమాలోకి

చంపడానికి వచ్చి కోమాలోకి

సయాన్ ను చంపడానికి వచ్చిన ఆ యువకుడు పోలీసుల నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించి విద్యుత్ స్థంభాన్ని ఢీకొని విద్యుత్ షాక్ గురై తీవ్రగాయాలై కోమాలోకి వెళ్లిపోయాడు. ఆయువకుడు కోయంబత్తూరులోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. సయాన్ ను హత్య చెయ్యడానికి వచ్చిన యువకుడిది కేరళ అని పోలీసులు గుర్తించారు. అతను కోమాలో ఉండటంతో పోలీసులు అతన్ని విచారించడానికి వీలుకావడం లేదు.

నిందితుడి వాంగ్మూలంలో పొల్లాచ్చి నేత

నిందితుడి వాంగ్మూలంలో పొల్లాచ్చి నేత

కొడనాడు ఎస్టేట్ హత్య కేసులోని నిందితుడు మనోజ్ ను విచారించగా పొల్లాచ్చిలోని అధికారంలో ఉన్న అన్నాడీఎంకే నేత పేరు తెరమీదకు వచ్చింది. ప్రస్తుతం కీలకపదవిలో ఉన్న ఆ నాయకుడు తనకు తెలుసని, జయలలిత మాజీ కారు డ్రైవర్ కనకరాజ్, సయాన్ స్వయంగా ఆ నాయకుడిని నాకు పరిచయం చేశాడని మనోజ్ పూసగుచ్చినట్లు చెప్పాడని పోలీసు అధికారులు అంటున్నారు.

దుబాయ్ నుంచి వచ్చిన సజీవన్

దుబాయ్ నుంచి వచ్చిన సజీవన్

కొడనాడు ఎస్టేట్ హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టింబర్ వ్యాపారి సహజీవన్ అలియాస్ సజీవన్ దుబాయ్ నుంచి కోయంబత్తూరు చేరుకున్నాడు. తనకు ఈకేసుకు ఎలాంటి సంబంధం లేదని మీడియా ముందు సజీవన్ స్పష్టం చేశాడు. అనవసరంగా తనను ఈ కేసులో ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారని వాపోయాడు.

కొడనాడు ప్రతి అణువణవూ తెలుసు

కొడనాడు ప్రతి అణువణవూ తెలుసు

2006-11 మధ్య కాలంలో తాను కొడనాడు బంగ్లా చెక్క పని చేశానని, అక్కడ ప్రతి అణువణవూ తనకు తెలుసు అని సజీవన్ చెప్పాడు. తన పనితనం చూసి జయలలిత, శశికళ నన్ను మెచ్చుకున్నారని అన్నాడు. అయితే కొడనాడులో హత్య జరిగిన సమయంలో తాను దుబాయ్ లో ఉన్నానని సజీవన్ వివరించాడు.

నాకు సంబంధం లేదు: మాజీ మంత్రి

నాకు సంబంధం లేదు: మాజీ మంత్రి

కొడనాడు ఎస్టేట్ లో జరిగిన హత్యకు తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి, అన్నాడీఎంకే పార్టీ నేత మిల్లర్ ఖండించారు. కేసు దర్యాప్తు కీలకదశకు సమీపిస్తున్న సమయంలో అసలు నేరస్తులను తప్పించడానికి తనను ఇరికించడానికి ప్రయత్నిస్తున్నారని మాజీ మంత్రి మిల్లర్ ఆరోపిస్తున్నారు.

జయలలిత తరువాత శశికళ, దినకరన్

జయలలిత తరువాత శశికళ, దినకరన్

జయలలిత మరణించిన తరువాత కొడనాడు ఎస్టేట్ బాగోగులు శశికళ, టీటీవీ దినకరన్ చూసుకుంటున్నారని పోలీసు అధికారుల విచారణలో వెలుగు చూసింది. జయలలిత మరణించిన తరువాత కొడనాడు ఎస్టేట్ లో ఎందుకు సీసీ కెమెరాల నిర్వహణ నిలిపివేశారని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

శశికళ, టీటీవీ దినకరన్ విచారణ ?

శశికళ, టీటీవీ దినకరన్ విచారణ ?

కొడనాడు ఎస్టేట్ హత్య, చోరీ కేసు దర్యాప్తు పూర్తి చెయ్యాలంటే శశికళ, టీటీవీ దినకరన్ లను విచారించాలని పోలీసు అధికారులు సిద్దం అయ్యారు. ఈ విషయంపై ఉన్నతాధికారులతో చర్చించి వారిని విచారణ చెయ్యాలని అధికారులు సిద్దం అయ్యారని తెలిసింది.

English summary
After Jayalalitha's death, Kodanadu Estate was managed by Sasikala and Dinakaran. So the police discussing with senior officials to inquire them in connection with murder and robbery incidents happened in Kodanadu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X