karan johar kajol bollywood narendra modi intolerance bjp muslims hindu awards కాజోల్ బాలీవుడ్ నరేంద్ర మోడీ అసహనం బిజెపి ముస్లింలు హిందు అవార్డులు
అసహనంపై స్పందించిన బాలీవుడ్ నటి కాజోల్
జైపూర్: బాలీవుడ్‌లో ఎలాంటి అసహనం లేదని సినీ నటి కాజోల్ అన్నారు. రాజస్థాన్ రాజధాని జైపూర్‌లో గత మూడు రోజులుగా జైపూర్ లిటరేచర్ ఫెస్టివల్ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో శనివారం ఆమె పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాజోల్ మీడియాతో మాట్లాడుతూ.. సమాజంలో ఏం జరిగినా.. అది తమ సినీ పరిశ్రమపై ప్రతిబింబిస్తుందని.. ఎలాంటి విషయానైనా తాము స్వాగతిస్తామని ఆమె పేర్కొన్నారు. బాలీవుడ్‌లో కులం, మతం అంటూ విభేదాలు లేవని.. అసహనం అంతకన్నా లేదని ఆమె స్పష్టం చేశారు.

ప్రస్తుత రోజుల్లో ప్రజలు చాలా సున్నితంగా ఉంటున్నారని.. అందుచేత ప్రముఖులు ఎప్పుడూ మంచి మాత్రమే మాట్లాడాలని ఆమె హితవు పలికారు. రెండ్రోజుల క్రితం బాలీవుడ్ నిర్మాత, కాజోల్ స్నేహితుడు కరణ్ జోహార్ అసనంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే.
దేశంలో మాట్లాడే స్వేచ్ఛ లేదని, ఏదైనా మాట్లాడితే ఆ తర్వాత జైల్లో ఉండాల్సి వస్తుందని అన్నారు. అంతకుముందు బాలీవుడ్ నటులు షారూఖ్, అమీర్‌ఖాన్‌లు భారత్‌లో అసహనంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దేశంలో అసహనం పెరిగిపోయిందని వ్యాఖ్యానించారు.