వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఓ బాబును కోల్పోయాడు, రెండో బాబును కాపాడుకునేందుకు ఈ పేద తండ్రి ఆరాటం

Google Oneindia TeluguNews

"మా మొదటి బాబును ఏడాది క్రితం చేతులారా పోగొట్టుకున్నాం. అనారోగ్యం కారణంగా బాధపడుతున్న వాణ్ని మేము కాపాడుకోలేకపోయాం. నేనూ, నా భార్య చాలా కృంగిపోయాం. ఆ బాధ ఇప్పటికీ అలాగే ఉంది. మాకు మరో బాబు కూడా ఉన్నాడు. అతడి పేరు వీర్. మా రెండో బాబు వీర్‌కి ఎలాగో అన్నయ్యను లేకుండా చేశాం. వాడికి అన్నయ్య లేని లోటును ఎలా తీర్చాలో మాకు అర్థం కాలేదు. కానీ ఇప్పుడు మా సమస్యలు మరింత పెద్దవయ్యాయి. వీర్‌కి 6నెలల వయస్సులో తలసేమియా ఉందని తెలిసింది. ఇప్పుడు వీర్ స్థితి హఠాత్తుగా ప్రమాదకరంగా మారింది. మేము వాడిని కూడా కోల్పోలేం. రెండో వాడిని కూడా కోల్పోతే ఇక బతకలేం."

మొదటి బాబు లేడన్న నిజాన్ని ఇంకా తాను జీర్ణించుకోలేకపోతున్న శర్మకు రెండో కొడుకు వీర్ ఆరోగ్య పరిస్థితి కూడా బాగోలేదని తెలియడంతో కుమిలిపోతున్నాడు. వీర్ కి వచ్చిన తలసేమియా తీవ్రత కాస్త పెరిగింది. తరచూ జ్వరం, జలుబు, డయేరియా, బలహీనత,తీవ్ర అలసట వీర్ ను రోజూ ఇబ్బందిపెడుతున్నాయి. దీంతో వీర్ తండ్రి శర్మ ఆందోళనతో సతమంతం అవుతున్నారు.

After losing his first son, this poor worker is fighting to save his second

"వీర్‌కి ఇప్పుడు 15 లక్షల విలువైన ఎముక మజ్జ ట్రాన్స్ ప్లాంట్ చికిత్స అవసరం ఉంది. ఇక మా ఆఖరి పాప ఖుషీ స్టెమ్ సెల్ దాతగా గుర్తించబడవచ్చు. నేను నా పూర్వీకుల నుంచి సంక్రమించిన భూమిని మొత్తం కూడా నా బిడ్డల ఆరోగ్యం కోసం అమ్మేశాను. నాకు తెలిసిన వాళ్లందరి దగ్గర అప్పులు చేశాను. నాకు మానసికంగా, శారీరకంగా కూడా శక్తి లేదు." అంటూ శర్మ తన బాధ వ్యక్తం చేశాడు.

After losing his first son, this poor worker is fighting to save his second

హాస్పిటల్స్ కు రోజూ తిరగాల్సి రావడంతో చేతిలో డబ్బులు లేకుండా పోయాయి శర్మకి. గంటలు గంటలు ట్యూబులతో ఉన్న తన కుమారుడు వీర్‌ను చూస్తే తన ప్రాణం తరుక్కుపోయేదని శర్మ బాధపడ్డాడు. ఆయనకి కావాల్సిందల్లా కేవలం తన బాబు సాధారణ జీవితం గడపడమే. శర్మ రెండేళ్ల క్రితమే ఉద్యోగం మానేసి వీర్‌ను చూసుకుంటున్నారు. కుటుంబం మొత్తం ఆయన భార్యకి నెలవారీ వచ్చే జీతం కేవలం 5000 రూపాయలపై ఆధారపడి బతుకుతోంది.

After losing his first son, this poor worker is fighting to save his second

"వీర్ చక్కగా స్కూలుకి వెళ్ళేవాడు ఎందుకంటే స్కూలంటే తన అన్నయ్యతో గడిపిన క్షణాలే అనుకునేవాడు. తను ఎప్పుడూ అన్నయ్యలాగా ఉండాలనుకునేవాడు, అన్నయ్యకి బాగా దగ్గర. అప్పుడప్పుడు వీర్ వంటింట్లోంచి స్వీట్లు దొంగిలించేటప్పుడు వాటి అల్లరి చూపులు అన్నీ వాడి అన్నయ్యని గుర్తు చేస్తాయి నాకు. మా పెద్దబాబు పోలికలే వీడిలో ఉన్నాయి." అంటూ కన్నీరు పెట్టుకున్నాడు శర్మ.

After losing his first son, this poor worker is fighting to save his second

శర్మ ఇబ్బందిపడుతోంది కేవలం వీర్ స్థితికి సంబంధించి మాత్రమేకాదు. శర్మ అమ్మగారికి షుగర్ మందుల ఖర్చును నెలకి మరో 10,000 రూపాయలు కూడా శర్మనే భరిస్తున్నాడు. ఈ ఖర్చులు వారి కుటుంబాన్ని అప్పుల ఊబిలోకి నెట్టివేశాయి. ఒక బిడ్డను ఇదివరకే పోగొట్టుకున్న శర్మ, మరో బిడ్డను పోగొట్టుకుంటానని బాధపడిపోతున్నాడు.

After losing his first son, this poor worker is fighting to save his second

ఈ కుటుంబం వీర్ తలసేమియాపై విజయవంతంగా పోరాటం చేయడానికి క్రౌడ్ ఫండింగ్ మొదలుపెట్టింది. మీరు కూడా వారి ఫండ్ రైజర్‌కు డొనేట్ చేసి సమయానికి బాబు చికిత్సకి సాయపడవచ్చు. మీకు తోచినంత సాయం చేసి వీర్ ప్రాణాలను నిలబెట్టండి. ఆ కుటుంబలో వెలుగులు నింపండి.

After losing his first son, this poor worker is fighting to save his second

సహాయం చేయదలుచుకున్న వారు ఈ కింది లింక్ క్లిక్ చేయండి

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X