వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్! ఓటర్లను మాయచేయమని చెప్పు: ‘సారీ’కి బీజేపీ డిమాండ్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: క్షమాపణలు చెప్పడంతోపాటు భవిష్యత్తులో ఓటర్లను మాయ చేయబోనని వాగ్దానం చేయాలని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీని కేంద్ర ఐటీ మంత్రి రవిశంకర్ ప్రసాద్ డిమాండ్ చేశారు. బుధవారం రవిశంకర్ ప్రసాద్ చేసిన ఓ ట్వీట్‌లో భారతదేశంలో ఎన్నికల ప్రక్రియను ప్రభావితం చేయడానికి కేంబ్రిడ్జ్ అనలిటికా డేటాను ఉపయోగించుకున్నట్లు స్పష్టంగా వెల్లడైందని పేర్కొన్నారు.

సారీ, భారత్ సహా ఇక ఏ దేశంలోనూ తప్పు జరగదు: జుకర్‌బర్గ్ సారీ, భారత్ సహా ఇక ఏ దేశంలోనూ తప్పు జరగదు: జుకర్‌బర్గ్

దీనిని భవిష్యత్తులో ఆపుతామని, భారతదేశ ఎన్నికల ప్రక్రియలో నైతికతను కాపాడతామని ఫేస్‌బుక్ హామీ ఇచ్చిందని గుర్తు చేశారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ క్షమాపణ చెప్పాలని, భవిష్యత్తులో ఓటర్లను మాయ చేయబోమని, సమాజాన్ని విభజించబోమని హామీ ఇవ్వాలని డిమాండ్ చేస్తోందని పేర్కొన్నారు.

After Mark Zuckerberg testimony, BJP demands Rahul Gandhi apologise for links with Cambridge Analytica

అంతకుముందు ఫేస్‌బుక్‌ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్‌ను ఫేస్‌బుక్ డేటా లీకేజీపై అమెరికా కాంగ్రెస్ ప్రశ్నించింది. ఆయన సమాధానం చెప్తూ లక్షలాది మంది ఫేస్‌బుక్‌ యూజర్ల సమాచారం అక్రమంగా వెల్లడైనందుకు తాను వ్యక్తిగతంగా బాధ్యత తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు. భారతదేశంతోపాటు ఇతర దేశాల్లో జరగబోయే ఎన్నికలకు ఎటువంటి నష్టం జరగకుండా అన్ని రకాలుగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

English summary
Facebook founder and CEO Mark Zuckerberg admitted to his mistake of "not doing enough" to prevent misuse of user data in his testimony before the United States Congress on Monday. This confirms Facebook's links with data mining firm Cambridge Analytica (CA) and the fact that CA took private data of millions of Facebook users to plan electoral campaigns campaigns for various political parties and leaders across the globe.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X