• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

పొత్తుపై మాయావతి ట్విస్ట్?: 'కైరానా' పైనే అందరి చూపు.. అదే రిపీట్ అవుతుందా!

|

లక్నో: ఉత్తరప్రదేశ్ లో ఎస్పీ-బీఎస్పీల కలయిక బీజేపీకి ఆందోళన కలిగించే అంశం. ఈ రెండు పార్టీల పరస్పర అవగాహనతో గోరఖ్ పూర్, ఫల్పూర్ నియోజకవర్గాల్లో ఇటీవల బీజేపీ దారుణంగా ఓడిపోయింది. పైగా ఆ రెండు స్థానాలు సాక్షాత్తూ సీఎం యోగి ఆదిత్యనాథ్, డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య ఖాళీ చేసినవి కావడం గమనార్హం.

ఈ నేపథ్యంలో 2019లోక్ సభ ఎన్నికల్లోనూ ఎస్పీ-బీఎస్పీ ఇదే పొత్తును కొనసాగిస్తే.. బీజేపీని కచ్చితంగా మట్టికరిపించవచ్చునన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే రెండు పార్టీల మధ్య ఆ దిశగా ప్రయత్నాలు కూడా మొదలయ్యాయి. అంతా బాగానే ఉంది కానీ.. సీట్ల సర్దుబాటు విషయమే పెద్ద తలనొప్పిగా మారే అవకాశం ఉంది. దానిపై చర్చలు జరుగుతుండగానే.. బీఎస్పీ అధినేత్రి మాయావతి తాజాగా ఓ ప్రకటన చేశారు.

పొత్తుపై ట్విస్ట్:

పొత్తుపై ట్విస్ట్:

బీఎస్పీకి తగినన్ని సీట్లు కేటాయిస్తేనే ఎస్పీతో పొత్తుకు సిద్దపడుతామని మాయావతి కుండబద్దలు కొట్టారు. లేనిపక్షంలో ఒంటరిగా బరిలో దిగేందుకు కార్యకర్తలంతా సిద్దంగా ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. బీఎస్పీ జాతీయ ఎగ్జిక్యూటివ్ సమావేశంలో మాయావతి ఈ వ్యాఖ్యలు చేశారు. సీట్ల సర్దుబాటుపై చర్చలు జరుగుతున్నాయని, అయినప్పటికీ ఒంటరిగా పోటీ చేసేందుకైనా మనమంతా సిద్దంగా ఉండాలని ఆమె సూచించారు.

మాయావతిపై సోనియా స్పెషల్ ఫోకస్:

మాయావతిపై సోనియా స్పెషల్ ఫోకస్:

ఇటీవల కర్ణాటక సీఎంగా కుమారస్వామి ప్రమాణస్వీకారం చేసినవేళ.. కాంగ్రెస్ మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ మాయావతిని ఆత్మీయ ఆలింగనం చేసుకోవడం సెంటరాఫ్ ఎట్రాక్షన్ గా నిలిచిన సంగతి తెలిసిందే. బీజేపీని ఓడగొట్టే వ్యూహం మరింత బలపడాలంటే మాయావతిని కూటమిలోకి తీసుకురావాలని సోనియా భావిస్తున్నారు.

దేశవ్యాప్తంగా బలమైన దళిత నేతగా ఉన్న మాయావతి.. ఎస్పీ, కాంగ్రెస్ కూటమిలో చేరితే అట్టడుగు వర్గాల ఓటు బ్యాంకును ఆకర్షించవచ్చునని భావిస్తున్నారు. అయితే ఎప్పటికైనా ప్రధానమంత్రి కావాలన్న లక్ష్యంతో ఉన్న మాయావతి.. కూటమిలో చేరితే తన ప్రాధాన్యం తగ్గిపోతుందా? అన్న కోణంలో ఆలోచిస్తున్నారు.

 మరో 20ఏళ్లు తానే అధినేత్రి:

మరో 20ఏళ్లు తానే అధినేత్రి:

పొత్తుల సంగతి పక్కనపెడితే.. బీఎస్పీకి మరో 20-22ఏళ్ల పాటు తానే అధ్యక్షురాలిగా కొనసాగుతానని మాయావతి స్పష్టం చేశారు. వృద్దురాలిని అయేంతవరకు పార్టీ భారాన్ని తానే మోస్తానని చెప్పారు. ఈ మేరకు కాన్షీరాం హయాంలో రూపొందించిన బీఎస్పీ రాజ్యాంగంలో ఆమె మార్పులు చేర్పులు చేశారు. అదే సమయంలో పార్టీ ఉపాధ్యక్షుడిగా సోదరుడు ఆనంద్ కుమార్ ను తప్పించారు మాయావతి. పార్టీలో పదవులపై బంధుప్రీతి ప్రభావం ఉండరాదన్న బీఎస్పీ నిబంధనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

 కైరానా పైనే అందరి చూపు:

కైరానా పైనే అందరి చూపు:


ఉత్తరప్రదేశ్ కైరానా లోక్ సభ ఉపఎన్నికపై దేశవ్యాప్తంగా అందరి చూపు నిలిచింది. గోరఖ్ పూర్, ఫల్పూర్ ఫలితమే ఇక్కడ కూడా రిపీట్ అయితే విపక్షాల ఐక్యతకు మరింత బలం చేకూరుతుంది. కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ ఇక్కడ ఆర్.ఎల్.డి అభ్యర్థికి మద్దతు పలుకుతున్నాయి. దీంతో బీజేపీ గెలిచి మళ్లీ తన సత్తా చాటుతుందా?.. లేక ప్రజలు ఆర్.ఎల్.డి వైపే మొగ్గుచూపి భవిష్యత్తులో కూటమి అడుగులకు బలం చేకూరుస్తారా? అన్నది వేచి చూడాలి.

English summary
Mayawati said she will continue to lead the Bahujan Samaj Party for the next 20 to 22 years, bluntly telling party leaders that nobody needed to dream of becoming the party president.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X