వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పరిస్థితి మారదా! మృతదేహాన్ని ప్లాస్టిక్ బ్యాగ్ లో మోసుకెళ్లిన బీహారీలు

|
Google Oneindia TeluguNews

పాట్నా : మొన్నటి ఒడిశా ఘటన కళ్లముందు ఇంకా కదలాడుతూనే ఉండగా.. అలాంటి ఘటనలు దేశవ్యాప్తంగా మరిన్ని చోటు చేసుకుంటుండడం శోచనీయం. అంబులెన్స్ లేని కారణంగా పోస్ట్ మార్టం నిర్వహించిన ఓ శవాన్ని కుటుంబ సభ్యులు ఓ ప్లాస్టిక్ బ్యాగ్ లో చుట్టి తీసుకెళ్లిన ఘటన బీహార్ లో చోటు చేసుకుంది.

సింటు కుమార్ అనే వ్యక్తి దాదాపు రెండు వారాల క్రితం ప్రమాదవశాత్తు గంగానదిలో పడి చనిపోయాడు. గత 25వ తేదీన అతడి మృతదేహాన్ని వెలికి తీయించారు పోలీస్ అధికారులు. అప్పటికే మృతదేహాం బాగా కుళ్లిపోయింది. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కతియార్ లోని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే శవాన్ని పోస్టుమార్టానికి స్వీకరించని అక్కడి వైద్యులు.. అక్కడికి 86కి.మీ దూరంలో ఉన్న భాగల్పూర్ ఆసుపత్రికి మృతదేహాన్ని తీసుకెళ్లాలని సూచించారు.

 After Odisha, Bihar shamed! People forced to carry dead relative in plastiac bag

అయితే మృతదేహాన్ని అంతదూరం తీసుకెళ్లడానికి తమ వద్ద అంత డబ్బు లేదని దయచేసి ఓ అంబులెన్స్ ఏర్పాటు చేయాలని సింటుకుమార్ బంధువులు ఆసుపత్రి సిబ్బందిని వేడుకున్నారు. నిర్లక్ష్యంగా స్పందించిన సిబ్బంది.. అసలు ఈ వ్యవహారంతో తమకు సంబంధం లేదని శవాన్ని తరలించడం పోలీసుల బాధ్యత అని చెప్పి వారిని అక్కడి నుంచి పంపించేశారు. దీంతో దిక్కు తోచని స్థితిలో మృతదేహాన్ని ప్లాస్టిక్ బ్యాగులో చుట్టి మోసుకుంటూ వెళ్లారు సింటుకుమార్ బంధువులు.

English summary
After more than two inhuman incidences where people were denied ambulances and were forced to carry their dead family members to the cremation ground by their own which shook the nation, another shocker was reported from Bihar where three people were forced to carry their dead relative in a plastic bag.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X