• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

Rajinikanth: ఈ సారి తలైవాతో: మ్యాన్ వర్సెస్ వైల్డ్: కర్ణాటక అడవుల్లో బేర్ గ్రిల్స్ ..!

|
  Man vs Wild : Rajinikanth's Shoot With Bear Grylls || Oneindia Telugu

  బెంగళూరు: మ్యాన్ వర్సెస్ వైల్డ్..బేర్ గ్రిల్స్. డిస్కవరీ ఛానల్‌ను చూసే వారికి ఏమాత్రం పరిచయం చేయనక్కర్లేని పేర్లు ఇవి. ఈ రెండు పేర్లూ మరోసారి తెర మీదికి వచ్చాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బేర్ గ్రిల్స్‌తో గత ఏడాది మ్యాన్ వర్సెస్ వైల్డ్ ఎపిసోడ్లను చిత్రీకరించిన డిస్కవరీ ఛానల్ యాజమాన్యం మరో మనదేశ గడప తొక్కింది. దక్షిణాది సూపర్‌స్టార్ రజినీకాంత్‌తో తాజాగా మ్యాన్ వర్సెస్ వైల్డ్ ఎపిసోడ్లను చిత్రీకరించబోతోంది.

  Srikakulam: జస్టిస్ ఫర్ సింధు: ఇంటర్ విద్యార్థినిపై అత్యాచారం, హత్యపై భగ్గుమంటోన్న యువత..!

  బండీపూర్ టైగర్ రిజర్వ్ జోన్‌లో

  బండీపూర్ టైగర్ రిజర్వ్ జోన్‌లో

  గత ఏడాది నరేంద్ర మోడీతో ఉత్తరాఖండ్‌లోని జిమ్ కార్బెట్ జాతీయ పార్కులో అడ్వెంచర్ సన్నివేశాలను చిత్రీకరించారు. ఈ సారి దక్షిణాదిన ఈ ఎపిసోడ్లను కెమెరాలో బంధించనుంది. కర్ణాటకలో విస్తరించిన పశ్చిమ కనుమల్లో ఈ ఎపిసోడ్లను చిత్రీకరించడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇందులో భాగంగా- బేర్ గ్రిల్స్.. మంగళవారం ఉదయం కర్ణాటకలోని చామరాజనగర జిల్లా బండీపూర్ టైగర్ రిజర్వ్ జోన్ అడవులకు చేరుకున్నారు. తమిళనాడు, కర్ణాటక, కేరళ సరిహద్దుల్లో విస్తరించిన పులుల సంరక్షణ అభయారణ్యం ఇది.

  రోజూ ఆరుగంటలు చొప్పున.. మంగళ, బుధ, గురువారాల్లో

  రోజూ ఆరుగంటలు చొప్పున.. మంగళ, బుధ, గురువారాల్లో

  బండీపూర్ అభయారణ్యంలో రెండు రోజుల పాటు ఈ అడ్వెంచరస్ డాక్యుమెంటరీ చిత్రీకరణ కొనసాగుతుంది. రోజూ ఆరు గంటల పాటు మాత్రమే షూటింగ్‌ను నిర్వహించాల్సి ఉంటుందని కర్ణాటక అటవీ మంత్రిత్వ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మంగళవారం మధ్యాహ్నం చిత్రీకరణ ఆరంభమౌతుందని తెలుస్తోంది. బుధ, గురువారాల్లో చిత్రీకరణ కొనసాగుతుంది. రోజూ ఆరు గంటలు మాత్రమే చిత్రీకరణ కొనసాగించాల్సి ఉంటుంది. దీనికోసం కర్ణాటక అటవీ మంత్రిత్వ శాఖ అధికారులు ఏకంగా 17 నిబంధనలను విధించారు.

  అక్షయ్ కుమార్ కూడా..

  రెండు రోజుల పాటు రజినీకాంత్‌పై ఈ అడ్వెంచరస్ సన్నివేశాలను చిత్రీకరిస్తారు. గురువారం చివరిరోజు.. బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్‌ కుమార్ కూడా బేర్ గ్రిల్స్ యూనిట్‌తో కలుస్తారు. బేర్ గ్రిల్స్, రజినీకాంత్, అక్షయ్‌కుమార్‌పై చివరిరోజు డాక్యుమెంటరీని షూట్ చేయబోతున్నారు. రజినీకాంత్. అక్షయ్ కుమార్.. 2.0 సినిమాలో కలిసి నటించిన విషయం తెలిసిందే. కర్ణాటక నుంచి కేరళను అనుసంధానించే సుల్తాన్ బతేరి జాతీయ రహదారితో పాటు ముళ్లెహోలె, మద్దూరు, కల్కెరె అటవీ రేంజ్ ప్రాంతాల్లో షూటింగ్ కొనసాగుతుంది.

   తలైవా స్లైల్‌తో మెస్మరైజ్..

  తలైవా స్లైల్‌తో మెస్మరైజ్..

  దక్షిణాది సినిమా తెరపై ఓ అతి సాధారణ సన్నివేశాన్ని కూడా తనదైన స్టైల్‌తో మెరుపులను మెరిపించే నటుడు సూపర్‌స్టార్ రజినీకాంత్. అలాంటి రజినీకి.. ఓ అంతర్జాతీయ స్థాయిలో రియల్ అడ్వెంచర్ సన్నివేశాల్లో పాల్గొనాల్సి రావడం.. తలైవా అభిమానులను ఆనందంలో ఓలలాడిస్తోంది. రజినీకాంత్ తనదైన శైలిలో మ్యాన్ వర్సెస్ వైల్డ్‌లో కనిపిస్తారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. చిత్రీకరణ కోసం ఉత్కంఠతతో ఎదురు చూస్తున్నారు.

  English summary
  Popular movie star Rajinikanth is now busy and so is Bandipur Tiger Reserve. The actor and a team of documentary makers from the popular international series Man Vs Wild are in the tiger reserve to shoot the documentary since Monday evening. The shooting is scheduled for six hours on Tuesday and again on Thursday.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
  X