వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తప్పు తెల్సుకున్న ఐటంగర్ల్ రాఖీ, సొంతపార్టీకి రిజైన్

By Srinivas
|
Google Oneindia TeluguNews

ముంబై: బాలీవుడ్ ఐటం గర్ల్, ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో ముంబై నుండి పోటీ చేసి ఓడిపోయిన రాఖీ సావంత్ మళ్లీ భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు. ఎన్నిలకు ముందు ఆమె రాష్ట్రీయ ఆమ్ పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. ఆ పార్టీ తరఫున ఆమె ముంబై నార్త్ వెస్ట్ లోకసభ స్థానానికి పోటీ చేశారు.

శివసేన పార్టీ సీనియర్ నేత గజానన్ చంద్రకాంత్ కీర్తికర్, కాంగ్రెస్ సీనియర్ నేత కామత్ గురుదాస్ వసంత్, మాయాంక్ రమేష్ (ఆమ్ ఆద్మీ పార్టీ)లు ఈ నియోజక వర్గం నుండి పోటీ చేశారు. వీరి పైన పోటీ చేసిన రాఖీ సావంత్ ఓడిపోయారు. దీంతో ఇప్పుడు ఆమె మళ్లీ బిజెపి వైపు చూస్తున్నారు.

After poll debacle, Rakhi quits her own party; wants to join BJP

తాను స్థాపించిన పార్టీకి ఆమె రాజీనామా చేశారు. రాష్ట్రీయ ఆమ్ పార్టీని స్థాపించిన రాఖీ సావంత్ ఆదివారం ఆ పార్టీకి రాజీనామా చేశారు. సమాచారం మేరకు ఆమె త్వరలో ఢిల్లీకి వెళ్లనున్నారు. అక్కడ బిజెపి జాతీయ అధ్యక్షులు రాజ్ నాథ్ సింగ్, కాబోయే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, బిజెపి సీనియర్ నేత సుష్మా స్వరాజ్‌లను కలువనున్నారని తెలుస్తోంది.

ఆదివారం తన పార్టీకి రాజీనామా చేసిన రాఖీ సావంత్ మాట్లాడుతూ... తాను చేసిన పొరపాటును గుర్తించానని, త్వరలో బిజెపిలో చేరుతానని చెప్పారు. తన చేరికను బిజెపి స్వాగతిస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. ఇక తాను ఎన్నికలలో పోటీ చేయనని, పార్టీ కోసం, ప్రజల కోసం పని చేస్తానని చెప్పారు.

<center><div id="vnVideoPlayerContent"></div><script>var ven_video_key="NTQ2MDIyfHwxMDExfHx8fHx8MTN8fA==";var ven_width="100%";var ven_height="325";</script><script type="text/javascript" src="http://ventunotech.com/plugins/cntplayer/ventuno_player.js"></script></center>

కాగా, రాఖీ సావంత్ పార్టీ పెట్టడానికి కొన్ని రోజుల ముందు బిజెపిలో చేరారు. బిజెపి పార్టీ ఆఫీసు తన ఇంటివంటిదన్నారు. ఆ తర్వాత అనూహ్యంగా రాష్ట్రీయ ఆమ్ పార్టీని స్థాపించి, ఇటీవలి ఎన్నికల్లో తన పార్టీ తరఫున పోటీ చేశారు. ఇప్పుడు పార్టీకి రాజీనామా చేసి, బిజెపిలో చేరనున్నారు.

English summary
Bollywood actress Rakhi Sawant, who founded a political party and contested in Lok Sabha elections, resigned from her own party Rashtriya Aam Party (RAP) on Sunday. Reportedly, she now wants to join BJP.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X