• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఇటు రేవంత్ జోరు-అటు పీసీసీపై పోరు -హర్యానా కాంగ్రెస్‌లో ముసలం -కుమారి సెల్జాతో హుడా వర్గం ఢీ

|

అంతర్గత ప్రజాస్వామ్యం అధికంగా కనిపించే కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు, కుమ్ములాటలు సహజంగా చోటుచేసుకునేవే. అయితే, బడా నేతల మధ్య తగువులాటల కారణంగా చాలా రాష్ట్రాల్లో పార్టీ మనుగడే ప్రశ్నార్థకమయ్యే పరిస్థితినీ కాంగ్రెస్ చవిచూసింది. సార్వత్రిక ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు ఓడి, అసెంబ్లీల పోరులోనూ వెనుకబడ్డ కాంగ్రెస్ ను అంతర్గత కుమ్ములాటలు మరింతగా తిప్పలు పెడుతున్నాయి. ఆ మధ్య రాజస్థాన్, కర్ణాటకలో, ఇటీవల పంజాబ్ కాంగ్రెస్ లో వర్గపోరు హైకమాండ్ వాకిట్లోకి చేరగా, ఇప్పుడు హర్యానా నేతలు సైతం హస్తినబాట పట్టారు..

షాకింగ్: టీఆర్ఎస్‌లో సీఎల్పీ విలీనం అనలేదు -రేవంత్ రెడ్డిని లోపలేస్తాం: ఫిరాయింపు ఎమ్మెల్యేలుషాకింగ్: టీఆర్ఎస్‌లో సీఎల్పీ విలీనం అనలేదు -రేవంత్ రెడ్డిని లోపలేస్తాం: ఫిరాయింపు ఎమ్మెల్యేలు

రాజస్థాన్‌లో గెహ్లోత్, పైలట్ మధ్య, కర్నాటకలో డీకే శివకుమార్, సిద్దరామయ్య మధ్య, పంజాబ్‌లో సీఎం అమరీందర్, సిద్దూ మధ్య పొరపొచ్చాలు తీవ్ర స్థాయిలో రాగా, ఒక్కొక్కటిగా సమస్యలను పరిష్కరిస్తూ అధిష్ఠానం ముందుకు కదులుతోంది. తెలంగాణలో రేవంత్ రెడ్డికి పీసీసీ పగ్గాలు ఇచ్చిన తర్వాత పార్టీలో కొంత జోరు కూడా కనిపిస్తున్నది. మంగళవారం జరగబోయే సోనియా గాంధీ -అమరీందర్ సింగ్ భేటీతో పంజాబ్ వివాదానికి దాదాపుగా తెరపడుతోందనీ ఆశిస్తున్న సమయంలోనే హర్యానా కాంగ్రెస్ లో విభేదాలు రచ్చకెక్కాయి..

After Punjab, Turmoil In Haryana Congress: Hooda camp at delhi against Kumari Selja

హర్యానా పీసీసీ చీఫ్ కుమారి సెల్జాకు, ఆ రాష్ట్ర మాజీ సీఎం, ప్రస్తుత ప్రతిపక్ష నేత భూపీంద్ర సింగ్ హుడాకు మధ్య చాలా కాలంగా కొనసాగుతోన్న వివాదాలు ఇప్పుడు తారా స్థాయికి చేరాయి. ఇరు వర్గాలు నేతలు తీవ్ర స్థాయిలో కుమ్ములాటలకు దిగుతున్నారు. కుమారి సెల్జా విషయంలో తాడో పేడో తేల్చుకోవాలని హుడా వర్గీయులు నేరుగా ఢిల్లీ బాట పట్టారు. హుడా వర్గానికి చెందిన సుమారు ఐదుగురు ఎమ్మెల్యేలు సోమవారం ఏఐసీసీ సంస్థాగత వ్యవహారాల కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌ను కలిశారు.

జగన్ ధిక్కారం: హెలికాప్టర్‌ ఇస్తాం, వెళ్లి చూడండి -సీమ ఎత్తిపోతలపై తొలిసారి ఎన్జీటీకి కేసీఆర్ సర్కార్జగన్ ధిక్కారం: హెలికాప్టర్‌ ఇస్తాం, వెళ్లి చూడండి -సీమ ఎత్తిపోతలపై తొలిసారి ఎన్జీటీకి కేసీఆర్ సర్కార్

  Megastar Chiranjeevi చిక్కుతారా.. చిక్కుల్లో పెడతారా.. ఈసారి ఆచితూచి..!!

  కుమారి సెల్జాను పీసీసీ పదవి నుంచి వెంటనే తప్పించాలని, ఆ స్థానంలో హుడాను నియమించాలని ఆ వర్గం ఎమ్మెల్యేలు పట్టుబడుతున్నారు. ప్రతిపక్ష నేతగా హుడా తీసుకునే నిర్ణయాలను పీసీసీ చీఫ్ సెల్జా అడుగడుగునా అడ్డుకుంటున్నారని, దీంతో అధికార బీజేపీతో పోరాటానికి వీలు కావడంలేదన్నది హుడా వర్గం ఎమ్మెల్యేల వాదన. కాగా, హుడా వర్గీయులకు ఏఐసీసీ పెద్దలు టైమివ్వబోతున్నారని, మంగళవారం కీలక నేతలు వారితో కలిసే అవకాశమున్నట్లు తెలుస్తోంది.

  English summary
  As the Congress party central leadership is grappling with dissension in its Punjab unit, there are reports of discontent brewing in Haryana as well. On Monday, at least five MLAs who met KC Venugopal are said to be close to former Chief Minister Bhupinder Singh Hooda. It is learnt that the Hooda camp is worried that state unit chief Kumari Selja supporters may walk away with most prime posts in the rejig exercise.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X