వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అనిల్ అంబానీ మెడకు ఉచ్చు బిగుస్తోంది: మరో బాంబు పేల్చిన ఫ్రాన్స్ జాతీయ పత్రిక

|
Google Oneindia TeluguNews

భారత ప్రభుత్వం ఫ్రాన్స్‌తో రాఫెల్ ఒప్పందం కుదుర్చుకున్న తర్వాత ఆర్‌కాం అధినేత అనిల్ అంబానీని కష్టాలు ఒకదాని తర్వాత ఒకటి వెంటాడుతున్నాయి. ఇప్పటికే రాఫెల్ కొనుగోలు విషయంలో అనిల్ అంబానీని ప్రతిపక్షాలు టార్గెట్ చేసి మాట్లాడుతుండగా తాజాగా ఫ్రాన్స్ పత్రిక మరో వార్త అనిల్ అంబానీపై ప్రచురించి బాంబు పేల్చింది.

అనిల్ అంబానీ మెడకు మరో ఉచ్చు

ఎప్పుడైతే రాఫెల్‌ యుద్ధ విమానాల ఒప్పందంలో అనిల్ అంబానీ అడుగుపెట్టారో ఇక అప్పటి నుంచే ఆయనకు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయినట్లు కనిపిస్తోంది. అనిల్ అంబానీకి ఎక్కడా కలిసిరాలేదు. మొన్నటికి మొన్న తన అన్న ముఖేష్ అంబానీ ఆపన్న హస్తం అందించి కొంత మొత్తం సాయం చేయడంతో జైలు ఊచలు లెక్కబెట్టకుండా తప్పించుకున్నారు. తాజాగా రాఫెల్ ఒప్పందంతో అనుసంధానమైన మరో అంశాన్ని వెలికి తీసింది ఫ్రాన్స్ జాతీయ దినపత్రిక లెమాండే.

అనిల్ అంబానీకి పన్ను మాఫీ చేసిన ఫ్రాన్స్ అధికారులు

పన్నురూపంలో తమకు అనిల్ అంబానీ చెల్లించాల్సిన 143.7 మిలియన్ యూరోలను ఫ్రాన్స్ అధికారులు మాఫీ చేశారు. దీంతో అనిల్ అంబానీకి భారీ ఊరట లభించింది.ఫ్రాన్స్‌లో అనిల్ అంబానీకి సంబంధించిన టెలికాం కంపెనీ "రిలయన్స్ అట్లాంటిక్ ఫ్లాగ్ ఫ్రాన్స్ " 143.7 మిలియన్ యూరోలు పన్నురూపంలో బాకీ పడింది. అయితే ప్రధాని నరేంద్రమోడీ ఫ్రాన్స్‌తో రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం ప్రకటించిన కొద్ది నెలల్లోనే అంబానీ ఫ్రాన్స్ ప్రభుత్వానికి కట్టాల్సిన పన్నును మాఫీ చేశారని లేమాండే ఓ కథనం ప్రచురించింది. రాఫెల్ ఒప్పందంపై భారత్ దస్సో కంపెనీల మధ్య చర్చలు జరుగుతున్న సమయంలో అంటే అక్టోబర్ 2015లోనే మాఫీ అయినట్లు కథనంలో పేర్కొంది. అంతకుముందే అంటే ఏప్రిల్ 2015లో ప్రధాని మోడీ ఫ్రాన్స్‌ పర్యటనకు వెళ్లిన సమయంలో భారత్ 36 రాఫెల్ యుద్ధ విమానాలను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించారు.

రాఫెల్ డీల్ ఓకే అయిన తర్వాతే అనిల్‌కు పన్ను మాఫీ

రాఫెల్ డీల్ ఓకే అయిన తర్వాతే అనిల్‌కు పన్ను మాఫీ

2007 నుంచి 2010 వరకు అనిల్ అంబానీ టెలికాం కంపెనీ ఫ్రాన్స్ ప్రభుత్వానికి 60మిలియన్ యూరోలను ట్యాక్స్‌ కట్టాల్సి ఉందని ఫ్రాన్స్ అధికారులు గుర్తించారు. అయితే రిలయన్స్ అట్లాంటిక్ ఫ్లాగ్ ఫ్రాన్స్ మాత్రం 7.6 మిలియన్ యూరోలను మాత్రమే చెల్లించగలమని అధికారులకు తెలిపింది. అయితే ఇందుకు ఫ్రాన్స్ అధికారులు ఒప్పుకోలేదని కథనంలో ప్రచురించింది. ఆ తర్వాత 2010 నుంచి 2012 వరకు ఆ కంపెనీ 91 మిలియన్ యూరోలను కట్టాలని మరో నివేదిక ఇచ్చినట్లు లేమాండే కథనంలో తెలిపింది.ఇక 2015లో ప్రధాని రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి ప్రకటన చేసిన సమయానికి అంబానీ టెలికాం కంపెనీ ఫ్రాన్స్ ప్రభుత్వానికి 151 మిలియన్ యూరోలు పన్ను రూపంలో కట్టాల్సి ఉన్నింది. అయితే ప్రధాని రాఫెల్ ప్రకటన చేసిన 6 నెలల తర్వాత ఫ్రాన్స్ ఇన్‌కంట్యాక్స్ శాఖ అనిల్ అంబానీ టెలికాం కంపెనీ కట్టాల్సిన 143.7 మిలియన్ పన్నును మాఫీ చేసిందని కథనంలో పేర్కొంది. తొలుత అనిల్ అంబానీ చెల్లిస్తామన్న7.3 మిలియన్ యూరోలు మాత్రమే చెల్లిస్తే సరిపోతుందని ఫ్రాన్స్ అధికారులు తెలిపారు.

మొత్తానికి భారతదేశాన్ని కుదిపేస్తున్న రాఫెల్ యుద్ద విమానాల కొనుగోలు అంశంలో తాజాగా అనిల్ అంబానీకి ఫ్రాన్స్ అధికారులు పన్ను మాఫీ చేశారని ఫ్రెంచి పత్రిక బయటపెట్టిన అంశాలు ఇంకెంత దుమారం రేపుతాయో వేచి చూడాలి.

English summary
French national newspaper Le Monde has reported that the French authorities waived off taxes worth 143.7 million euros or 162.6 million dollars in favour of Indian businessman Anil Ambani's France-based telecom company called "Reliance Atlantic Flag France". Anil Ambani's tax debt, result of a disputed tax litigation, was cleared a few months after Prime Minister Narendra Modi announced the Rafale deal with France.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X