వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హి ఈజ్ ఇన్ క్యూ.. ప్లీజ్ వెయిట్! రూ.4 వేల కోట్లకు మరో బడాబాబు శఠగోపం!?

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

లక్నో: బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఎగవేసిన విజయ్ మాల్యా, నీరవ్ మోడీ, విక్రమ్ కొఠారీ తదితరుల బాటలో కాన్పూర్‌కు చెందిన మరో బడాబాబు ఎంపీ అగర్వాల్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. ఈయన రూ.3,972 కోట్ల మేర 16 బ్యాంకుల కన్సార్టియం నుంచి రుణాలు పొంది ఎగవేసినట్లు సమాచారం.

ఎంపీ అగర్వాల్ నేతృత్వంలోని శ్రీ లక్ష్మి కోట్సిన్ లిమిటెడ్‌కు సెంట్రల్ బ్యాంక్ నేతృత్వంలోని కన్సార్షియం ఈ రుణాలను ఇచ్చినట్లు తెలుస్తోంది. శ్రీ లక్ష్మి కోట్సిన్ లిమిటెడ్‌కు అగర్వాల్ చైర్మన్, సీఈఓగా వ్యవహరిస్తున్నారు. టెక్స్‌టైల్స్‌తోపాటు ఆటోమొబైల్స్ కూడా ఈ కంపెనీ తయారు చేస్తోంది.

After Rotomac, Another Kanpur Firm Under Scanner For Loan Default

ఈ కంపెనీ నుంచి రుణాలను రాబట్టుకునేందుకు సెంట్రల్ బ్యాంక్ ఇప్పటికే అగర్వాల్ ఆస్తులను వేలం వేయడం ప్రారంభించినట్లు విశ్వసనీయ సమాచారం. ఈ కంపెనీ బ్యాలెన్స్ షీట్ ప్రకారం ఆస్తుల విలువ రూ.1,495 కోట్లు అని తేల్చారు.

రూ.3,972 కోట్లు రాబట్టుకునేందుకు సెంట్రల్ బ్యాంకు డెట్ రికవరీ ట్రైబ్యునల్‌ను ఆశ్రయించింది. సిక్ యూనిట్‌గా పరిగణించి, రాజీ కుదిర్చేందుకు 2016 నవంబరు 30న ఈ కేసును నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్‌కు బదిలీ చేశారు.

English summary
After Kanpur-based Rotomac owner Vikram Kothari, another firm in Kanpur, Shri Lakshmi Cotsyn Limited, has allegedly defrauded a consortium of 16 banks of over nearly Rs 3,972 crore. Central Bank, the leading bank of the consortium that gave loans to the firm, has already started auctioning firm’s assets for the recovery of loans. The firm’s office is registered at Krishnapuram on GT Road in Kanpur, while the Group Chairman and Managing Director is MP Agarwal. Apart from textiles, the company also makes automobiles blast proof.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X