వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆధార్ కార్డు చట్టబద్ధతపై తీర్పు: రిజర్వులో ఉంచిన సుప్రీం కోర్టు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఆధార్ కార్టు చట్ట బద్ధతపై దాఖలైన పిటిషన్ల మీద సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. నాలుగు నెలలుగా ప్రభుత్వం, పిటిషనర్ల మధ్య వాదోపవాదాలు నడిచాయి. ఇందుకు సంబంధించిన తీర్పును సుప్రీం కోర్టు గురువారం రిజర్వ్‌లో ఉంచింది.

ఈ ఏడాది జనవరి నుంచి ఆధార్ చట్టబద్ధతపై వాదనలు జరుగుతున్నాయి. కేంద్రం ఆధార్‌ను తప్పనిసరి చేయడంతో దానిపై కొందరు సుప్రీంలో పిటిషన్లు దాఖలు చేశారు. ఆధారు కోసం తీసుకున్న సమాచారం వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించే విధంగా ఉందని పిటిషనర్లు ఆరోపించారు.

After second largest oral hearing, Supreme Court reserves Aadhaar verdict

ఇది మానవుల జీవితంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, వ్యక్తిగత జీవితం అంటూ ఏమీ లేకుండా పోతుందని పిటిషనర్లు తమ వాదనలు వినిపించారు.

ప్రభుత్వం అందించే అనేక సేవలను, పథకాలను ఆధార్‌తో తప్పనిసరిగా అనుసంధానం చేసుకోవాలని ప్రభుత్వం సూచించింది. దీంతో అవినీతికి అడ్డుకట్ట పడుతుందని, ప్రభుత్వ సేవలను అందరికి సులభంగా అందించవచ్చని ప్రభుత్వం చెబుతోంది. సమాచారం భద్రంగా ఉంటుందని చెబుతోంది.

English summary
The Supreme Court on Thursday reserved its order on petitions challenging Constitutional validity of Aadhaar Act.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X