వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిఎం భవనం వద్దు: కేజ్రీవాల్, ఇది వరకే భద్రతపై

By Pratap
|
Google Oneindia TeluguNews

Arvind Kejriwal
న్యూఢిల్లీ: తనకు సెక్యూరిటీ వద్దన్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధినేత, కాబోయే ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్ ఇప్పుడు తనకు ముఖ్యమంత్రికి కేటాయించే ప్రత్యేక భవనం కూడా వద్దని అంటున్నారు. ఢిల్లీ ప్రధాన కార్యదర్శి డిఎం సపోలియా మంగళవారంనాడు కేజ్రీవాల్‌ను కలిసి అధికారిక నివాసం గురించి చర్చించారు.

అలాంటి భవనం తనకు అవసరం లేదని కేజ్రీవాల్ కచ్చితంగా చెప్పేశారు. విఐపి సంస్కృతికి స్వస్తి చెప్పడంలో భాగంగానే ఆయన అధికారిక నివాసం తనకు అవసరం లేదని చెప్పారు. ప్రభుత్వ ప్రధాన కార్యదర్సి మంత్రి వర్గ కూర్పుపై, ప్రమాణ స్వీకార కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్ల గురించి కేజ్రీవాల్‌తో చర్చించినట్లు సమాచారం

ఐఎఎస్ అధికారి రాజేంద్ర కుమార్‌ను తన ప్రిన్సిపల్ కార్యదర్శిగా నియమించుకున్నారు. రాజేంద్ర కుమార్ 1989 బ్యాచ్ ఐఎఎస్ అధికారి. ప్రస్తుతం ఆయన ఢిల్లీ ప్రభుత్వం ఉన్నత విద్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. ఖరగ్‌పూర్ ఐఐటిలో ఆయన చదువుకున్నారు.

అర్వింద్ కేజ్రీవాల్‌కు ఢిల్లీ ఏడో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ పచ్చజెండా ఊపారు. బయటి నుంచి కాంగ్రెసు మద్దతు తీసుకుంటూ కేజ్రీవాల్ ఢిల్లీలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు. కాంగ్రెసు మద్దతు తీసుకున్నప్పటికీ అవినీతిపై విచారణ జరిపిస్తామని ఆయన చెప్పారు.

English summary
Arvind Kejriwal, who will be Delhi's new chief minister, has turned down a government bungalow that comes with his new role.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X