వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎన్సీపి షాక్: పొత్తు కోసం ఎస్పీతో కాంగ్రెస్ మంతనాలు

|
Google Oneindia TeluguNews

 After split with NCP, Congress may join hands with SP in Maharashtra
ముంబై: కాంగ్రెస్ పార్టీతో ఉన్న 15ఏళ్ల బంధాన్ని శరద్ పవార్ నేతృత్వంలోని నేషనల్ కాంగ్రెస్ పార్టీ(ఎన్సీపి) తెంచుకోవడంతో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ కొత్త మిత్రుల వేటలో వుంది. మహారాష్ట్ర ఎన్నికలు త్వరలో జరగనున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ.. సమాజ్‌వాదీ పార్టీతో కలిసి ముందుకెళ్లేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం.

ఇప్పటికే కాంగ్రెస్, సమాజ్‌వాదీ పార్టీ నాయకులు పొత్తు విషయంపై చర్చించారని కాంగ్రెస్ పార్టీ సన్నిహిత వర్గాలు శుక్రవారం పేర్కొన్నాయి. ఈ విషయంపై ఒకటి రెండు రోజుల్లో ప్రకటించే అవకాశం ఉందని తెలిపాయి. సమాజ్‌వాదీ పార్టీ ఎనిమిది అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

పలు విషయాల్లో విభేదాల కారణంగా ఎన్సీపి.. కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఉపసంహరించుకున్న నేపథ్యంలో మహారాష్ట్రకు చెందిన ఎస్పీ అగ్రనాయకులతో కాంగ్రెస్ నేతలు ఇప్పటికే పలుమార్లు చర్చలు జరిపినట్లు సమాచారం. సమాజ్‌వాదీ పార్టీ మహారాష్ట్ర అధ్యక్షుడు అబు అజ్మీ కూడా రానున్న ఎన్నికల్లో కలిసి పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ నేతలతో మంతనాలు జరుపుతున్నట్లు తెలిసింది.

కాంగ్రెస్, ఎస్పీ పార్టీల మధ్య అనేక విషయాల్లో విభేదాలు ఉన్నప్పటికీ శివసేన, భారతీయ జనతా పార్టీలను ఓటించాలనే ఉద్దేశంతో ఈ రెండు పార్టీలు పొత్తు పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది. కాగా, తమ పార్టీని సంప్రదించకుండా 118మంది అభ్యర్థులతో కాంగ్రెస్ తన మొదటి జాబితాను ప్రకటించడంతో ఆగ్రహానికి గురైన ఎన్సీపి 15ఏళ్ల బంధానికి ముగింపు పలికింది.

English summary
A day after the Sharad Pawar-led Nationalist Congress Party (NCP) severed its 15-year-old ties with the Congress, there are reports of a possible tie up between the Grand Old Party and the Samajwadi Party for the fast approaching assembly elections in Maharashtra.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X