వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహుల్ నాయకత్వం మరోసారి అట్టర్ ఫ్లాప్: దిగ్విజయ్ ఏమన్నారంటే!..

ఎస్పీతో జతకట్టినా సరే యూపీలో కాంగ్రెస్ చిత్తుకాక తప్పలేదు. కాంగ్రెస్ తో జతకట్టి తప్పు చేశామన్న భావనలో ఎస్పీ సైతం ఇప్పుడు తలపట్టుకుంది. ఫలితాలు ఇంకా పూర్తిగా వెలువడకముందే ఎస్పీ కార్యాలయంలోని రాహుల్ గాం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఎస్పీతో జతకట్టినా సరే యూపీలో కాంగ్రెస్ చిత్తుకాక తప్పలేదు. కాంగ్రెస్ తో జతకట్టి తప్పు చేశామన్న భావనలో ఎస్పీ సైతం ఇప్పుడు తలపట్టుకుంది. ఫలితాలు ఇంకా పూర్తిగా వెలువడకముందే ఎస్పీ కార్యాలయంలోని రాహుల్ గాంధీ కటౌట్లు తొలగించేశారు.

మొత్తం మీద కాంగ్రెస్ ఓటమి ఆ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వంపై మరోసారి ప్రశ్నలు ఎక్కుపెట్టింది. యూపీలో పార్టీ చిత్తవడంతో రాహుల్ నాయకత్వంపై జనాలకు నమ్మకం లేదన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో రాహుల్ ను అదే స్థానంలో కొనసాగిస్తారా? భవిష్యత్ వ్యూహాలేంటి? వంటి అంశాలపై తాజాగా ఆ పార్టీ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ స్పందించారు. ప్రాంతీయంగా కాంగ్రెస్ పార్టీ నేత‌లు బ‌ల‌ప‌డాల్సిన అవ‌స‌రం ఉంద‌ని దిగ్విజ‌య్ అన్నారు. కాంగ్రెస్ నాయకత్వం లేని రాష్ట్రాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రణాళికలు సిద్దం చేస్తామని తెలిపారు.

After up debacle should rahul gandhi be removed questions

పార్టీని పునర్మించడానికి, మరింత బలోపేతం చేయడానికి యాక్షన్ ప్లాన్ సిద్దం చేయాల్సి ఉందని దిగ్విజయ్ అన్నారు. నెహ్రూ-గాంధీ నాయకత్వం వల్లే కాంగ్రెస్ పార్టీ ఇన్నాళ్లు బలంగా ఉందని, అందువల్లే ఇప్పుడు నాయకత్వం రాహుల్ కు వెళ్లిందని అన్నారు.

కాంగ్రెస్ పార్టీ యువకులను ప్రోత్సహించదన్న వాదనను దిగ్విజయ్ కొట్టిపారేశారు. తనకు 31ఏళ్ల వయసులో రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీలో అవకాశం కల్పించారని పేర్కొన్నారు. యూపీ ఎన్నికల్లో ప్రధాని మోడీ, అమిత్ షా ఇద్దరూ కులరాజకీయాలకు పాల్పడ్డారని ఆరోపించారు. హిందూ-ముస్లింల ఓటర్లను ఆకట్టుకునేందుకు మోడీ, అమిత్ షా ప్లాన్ వేశారని మండిపడ్డారు.

English summary
After up debacle the questions raising on Rahul gandhis leadeship in congress party. Senior leader Digwijay Singh was responded on the up results
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X