వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శకట రాజకీయం: నిన్న బెంగాల్..నేడు మహారాష్ట్ర: గణతంత్ర వేడుకల్లో మరాఠా శకటానికీ బ్రేక్..!

|
Google Oneindia TeluguNews

ముంబై: కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమికి సారథ్యాన్ని వహిస్తోన్న భారతీయ జనతా పార్టీ గణతంత్ర దినోత్సవ వేడుకలను రాజకీయ కక్షసాధింపుల కోసం వినియోగంచుకుంటోందా? ఆయా రాష్ట్రాల సంస్కృతి, సంప్రదాయాలను ప్రతిబింబించే శకటాలను ఉద్దేశపూరకంగానే అడ్డుపడుతోందా? అనే ప్రశ్నలకు అవుననే సమాధానాన్ని ఇస్తున్నారు నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ లోక్ సభ సభ్యురాలు సుప్రియా సులే.

పశ్చిమ బెంగాల్ శకటానికి గణతంత్ర దినోత్సవ వేడుకల్లో చోటు కల్పించలేదు కేంద్ర ప్రభుత్వం. ఈ శకటానికి సంబంధించిన ప్రతిపాదనలను తోసి పుచ్చింది. దేశ రాజధానిలో నిర్వహించబోయే గణతంత్ర దినోత్సవ పరేడ్ లో పశ్చిమ బెంగాల్ శకటం కనిపించదు. తాజాగా- మహారాష్ట్ర శకట ప్రదర్శనకు కూడా కేంద్ర ప్రభుత్వం చోటు కల్పించలేదని సుప్రియా సులే వెల్లడించారు. రాజకీయ కారణాలు, దురుద్దేశంతోనే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సాంస్కృతిక మూలాలపై దెబ్బకొడుతోందని మండిపడ్డారు.

After West Bengal, Maharashtra’s Republic Day tableau gets rejected by Centre, says Supriya Sule

ఈ మేరకు గురువారం ఆమె ఓ ట్వీట్ చేశారు. మహారాష్ట్ర, పశ్చిమ బెంగాల్ రెండూ స్వాతంత్య్ర పోరాటంలో తమవంతు పాత్ర పోషించాయని, ఘన చరిత్ర ఉన్న మహారాష్ట్ర శకటాన్ని కేంద్రం ఏ కారణంతో నిరాకరించిందనే విషయాన్ని వెల్లడించాలని ఆమె డిమాండ్ చేశారు. మహారాష్ట్రలో బీజేపీకి అధికారాన్ని దూరమైందనే అక్కసును కేంద్రం ఈ రకంగా తీర్చుకుంటోందని విమర్శించారు. దేశం యావత్తూ పండగలా జరుపుకొనే కార్యక్రమాన్ని కేంద్రం ప్రభుత్వం రాజకీయ వేదికగా మార్చిందని ఆరోపించారు.

స్వాతంత్య్ర దినోత్సవం, గణతంత్ర దినోత్సవ వేడుకల్లో దేశ రాజధానిలో ఆయా రాష్ట్రాల సంస్కృతీ, సంప్రదాయాలను ప్రతిబింబించేలా శకటాలను ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తోంది. ఈ వేడుకల్లో తమ రాష్ట్ర శకటాన్ని ప్రదర్శించడాన్ని ప్రతిష్ఠాత్మంగా తీసుకుంటూంటాయి రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు. ఈ సారి కూడా దీనికి సంబంధించిన మొత్తం 56 ప్రతిపాదనలు రక్షణ మంత్రిత్వ శాఖకు అందాయి.

English summary
NCP MP Supriya Sule on Thursday alleged that the Centre has denied permission to the tableaux from the non-BJP-ruled Maharashtra and West Bengal for the Republic Day parade, and said the government was behaving in a "prejudiced" manner.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X