వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యోగా చేయించారు.. ఇక భద్రత కల్పిస్తారు, మరో రంగంలోకి బాబా రాందేవ్‌!

పతంజలి బ్రాండ్ ద్వారా వ్యాపార రంగంలో అడుగుపెట్టిన ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌ ఇప్పుడు మరో రంగంలోకి ప్రవేశించారు. తాజాగా ఆయన ఓ సెక్యూరిటీ ఏజెన్సీని ప్రారంభించారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పతంజలి బ్రాండ్ ద్వారా వ్యాపార రంగంలో అడుగుపెట్టిన ప్రముఖ యోగా గురువు బాబా రాందేవ్‌ ఇప్పుడు మరో రంగంలోకి ప్రవేశించారు. తాజాగా ఆయన ఓ సెక్యూరిటీ ఏజెన్సీని ప్రారంభించారు.

'పరాక్రమ్‌ సురక్ష ప్రైవేట్‌ లిమిటెడ్‌' పేరుతో ఏజెన్సీని ప్రారంభించారు. స్వీయ, దేశ భద్రతకు ఉపయోగపడే విధంగా వ్యక్తులను సన్నద్ధం చేసేందుకు ఈ సంస్థను ప్రారంభించినట్లు ఆయన ట్విటర్‌ ద్వారా తెలియజేశారు.

baba-ramdev

పదవీ విరమణ చేసిన పోలీసులు, సైన్యాధికారులతో యువకులకు శిక్షణ ఇప్పించనున్నారు. ఆర్మీలో చేరే యువకులకు ఎంతటి కఠిన శిక్షణ ఇస్తారో.. ఈ సంస్థలో చేరే యువకులకు కూడా అలాంటి కఠిన శిక్షణ ఇవ్వనున్నట్లు పతంజలి ఆయుర్వేద సీఈవో ఆచార్య బాలకృష్ణ తెలిపారు.

పరాక్రమ్‌ సురక్షలో శిక్షణ పొందిన యువకులు ఆర్మీలో చేరేందుకు కూడా సిద్ధంగా ఉండేలా తయారు చేస్తామని ఆయన పేర్కొన్నారు. 22-40 ఏళ్ల వయసు ఉన్న పురుషులకు ఈ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిపారు. భవిష్యత్‌లో మహిళలకు కూడా ఈ సంస్థలో చేరే అవకాశాన్ని కల్పిస్తామని ఆచార్య బాలకృష్ణ పేర్కొన్నారు.

ఈ సంస్థ ద్వారా ఏడాదికి 25-50 వేల మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని, పరాక్రమ్‌ సురక్షను టాప్‌ సెక్యూరిటీ ఏజెన్సీలలో ఒకటిగా నిలుపుతామని రాందేవ్‌ తెలిపారు. ఇప్పటికే బాబా రాందేవ్‌ ఆయుర్వేద, ఎఫ్‌ఎంసీజీ వ్యాపారాల్లో మంచి వృద్ధి సాధిస్తున్నారు.

English summary
Yoga guru and founder of the Patanjali Ayurveda, Baba Ramdev has now forayed into the security business. According to a tweet shared by the Yoga guru, he had launched his security firm 'Parakram Suraksha Private Ltd' on July 10. “Launched Parakram Security today. It will provide jobs to 25-50k youth in the country and soon be among the top security companies of India,” wrote Ramdev.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X