వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పార్లమెంట్‌పై దాడి: అప్జల్ గురు ఉరిపై థరూర్ వివాదాస్పద వ్యాఖ్యలు

By Nageswara Rao
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పార్లమెంట్‌పై దాడికి పాల్పడిన ఉగ్రవాది మహ్మాద్ అప్జల్ గురు ఉరితీయడాన్ని అత్యంత తప్పుగా ఘోరంగా నిర్వహించారని సోమవారం కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ వ్యాఖ్యానించారు.

కేరళలోని తిరువనంతపురంకు చెందిన కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ ఈ విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా ట్వీట్ చేశారు. "అప్జల్ గురు ఉరిని తప్పు, ఘోరంగా నిర్వహించిందని నేను భావిస్తున్నాను. కుటుంబానికి ఒక హెచ్చరిక చేసి, చివరి సమావేశం నిర్వహించి శరీరం ఇచ్చి వుండాలి" అంటూ ట్వీట్ చేశారు.

ఢిల్లోని తీహార్ జైల్లో ఫిబ్రవరి 9, 2013న యూపీఎ ప్రభుత్వ పాలనలో మహ్మాద్ అప్జల్ గురుని ఉరి తీసిన విషయం తెలిసిందే. జైలు ఆవరణలోనే అఫ్జల్ మృతదేహాన్ని అధికారులు ఖననం చేశారు. ఉరిశిక్ష అమలు చేసిన ప్రదేశానికి సమీపంలోని జైలు నెం.3 వద్ద ఖననం ప్రక్రియను పూర్తిచేసినట్లు జైలు అధికారు ఒకరు తెలిపారు.

జమ్మూ కాశ్మీర్‌లోని ఐదుగురు కాంగ్రెస్ శాసనసభ సభ్యులు అప్జల్ గురు ఉరిని తప్పుబడుతూ ప్రకటన చేసిన తర్వాత శశి థరూర్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. మహ్మాద్ అప్జల్ గురుని ఉరి తీసిన సందర్భంలో తన కుటుంబ సభ్యులను అనుమతించి ఉండాల్సిందంటూ జమ్మూ కాశ్మీర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సోమవారం అన్నారు.

Afzal Guru's hanging was 'wrong, badly handled': Shashi Tharoor

అఫ్జల్ ఉరితీత విషయం అస్సలు మాకు తెలియదని, కేంద్రం లేఖ ద్వారా సమాచారం అందజేయలేదని ఆతని కుటుంబీకులు వాపోయిన సంగతి విదితమే. అప్జల్ గురు ఉరితీతను అధికారులు స్పీడ్ పోస్ట్ చేసినా, అతని కుటుంబానికి అది రెండు రోజులు తర్వాత అందింది.

తాము టీవీలో చూసి గురు ఉరిశిక్ష అమలు విషయాన్ని తెలుసుకున్నామన్నారు. తెలిసివుంటే అఫ్జల్ గురును చివరిసారిగా చూసివుంటామని, ఆతని చివరి కోరికనైనా తీర్చేవారిమని అఫ్జల్ గురు బంధువు ఆ సందర్భంలో యాసీన్ చెప్పారు.

అఫ్జల్ గురుకి ఉరి వేసి సోమవారం రెండవ వార్షికోత్సవం కావడంతో ఎలాంటి అల్లర్లు జరగక్కుండా చూసేందుకు అనేక మంది వేర్పాటువాదుల నాయకులను గృహ నిర్బంధం చేశారు. జమ్మూ కాశ్మీర్‌లోని పలు సమస్యాత్మర ప్రాంతాలైన సాఫాకుదాల్, మహారాజ్ గుంజ్, రైనావారి, నౌవాట్టాలో పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. లాలా చౌక్ ప్రాంతంలోని బిజినెస్ కాంప్లెక్స్‌కు భద్రాత దళాలను మోహరించారు.

English summary
In what can bring in huge embarrassment for the Congress, MP Shashi Tharoor on Monday opined that the hanging of Parliament attack convict Mohammad Afzal Guru was "wrong and badly" handled.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X