వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సెల్ వాడొద్దన్నందుకు ఇద్దరు అమ్మాయిల ఆత్మహత్య

|
Google Oneindia TeluguNews

Agartala: Rebuked for Using Mobile Phones, Two Girls Allegedly Commit Suicide
అగర్తాలా: సెల్‌ఫోన్ల ప్రభావం నేటి యువతపై ఎంత ఉందనే దానికి ఈ ఘటన నిదర్శనంగా చెప్పవచ్చు. సెల్‌ఫోన్లు వాడరాదని మందలించినందుకు ఇద్దరు పదో తరగతి అమ్మాయిలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. దీంతో వారి కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఈ ఘటన త్రిపుర రాష్ట్రంలో చోటు చేసుకుంది.

పోలీసుల కథనం ప్రకారం.. పశ్చిమ త్రిపురలోని తకర్జల ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థులు హాస్టల్ నిబంధనలకు విరుద్ధంగా రహస్యంగా సెల్ ఫోన్ వాడుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న హాస్టల్ సూపరింటెండెంట్ వారి తల్లిదండ్రులను పిలిపించి అమ్మాయిలను మందలించారు.

అనంతరం ముగ్గురు అమ్మాయిలు హాస్టల్ వీడి వెళ్లారు. వీరిలో ఇద్దరు చెట్టుకు ఉరివేసుకుని మృతి చెందారు. వీరిపై ఎలాంటి అఘాయిత్యం జరిగినట్లు ఆనవాళ్లు లేవని పోలీసులు తెలిపారు. ఘటనపై విచారిస్తున్నట్లు చెప్పారు.

ఆత్మహత్య చేసుకున్న సిమా దెబ్బర్మా, బినా దెబర్మా(16) మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అత్యాచారం జరిగినట్లుగా ఎలాంటి ఆనవాలు లేవని వైద్య నివేదికలో వెల్లడైందని పోలీసులు చెప్పారు. ఘటన జరిగిన ప్రాంతం నుంచి ఫోరెన్స్ బృందం నమూనాలను, ఇతర మెటీరియల్స్‌ను సేకరించిందని తెలిపారు.

English summary

 Two teenaged girls allegedly committed suicide after their hostel superintendent and parents rebuked them for using mobile phones, police said in Agartala on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X