వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సోనియా, రాహుల్, మన్మోహన్‌ల అరెస్ట్!: అధినేత్రికి అగస్టా మరింత చిక్కు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ శుక్రవారం నాడు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించింది. ఈ ధర్నాలో పాల్గొన్న ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్‌లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వారిని అదుపులోకి తీసుకోవడంతో ఉద్రిక్తత ఏర్పడింది. అగస్టా కుంభకోణంలో కాంగ్రెస్ పార్టీని బెజెపి టార్గెట్ చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చిన కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు ధర్నాలో పాల్గొన్నారు.

ఇదిలా ఉండగా, కాంగ్రెస్ పార్టీని ఇరుకున పెట్టేసిన అగస్టా వెస్ట్‌ల్యాండ్ కుంభకోణంలో సోనియా గాంధీకి మరింత విషమ పరిస్థితి ఎదురయ్యేలానే కనిపిస్తోంది. ఈ కేసుకు సంబంధించి ఇటలీ కోర్టు ఇచ్చిన తీర్పు కాపీలో ఆమె పేరు ప్రస్తావన స్పష్టంగా ఉంది.

Agusta scam: Sonia Gandhi, Rahul Gandhi, Manmohan Singh, others detained by police

ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా మూడు నాలుగుసార్లు ఆమె పేరు ఆ తీర్పు కాపీలో ప్రస్తావనకు వచ్చింది. అగస్టా మాజీ సీఈఓ గుస్పెపీ ఓర్సీ ఇచ్చిన వాంగ్మూలం మేరకు గతంలోనే ఈ కేసుకు సంబంధించి ఇటలీ కోర్టు తీర్పు వెలువరించింది.

తాజాగా ఈ తీర్పునకు సంబంధించిన కాపీ వెలుగులోకి వచ్చింది. మొత్తం 225 పేజీలున్న ఈ తీర్పులో సోనియా గాంధీ పేరు నాలుగు చోట్ల ప్రస్తావనకు వచ్చింది. తీర్పు కాపీలోని 193, 204 పేజీల్లో సోనియా పేరును సిన్యోరా గాంధీగా జడ్జీ నాలుగు సార్లు ప్రస్తావించారు.

English summary
Sonia Gandhi, Rahul Gandhi, Manmohan Singh, others detained by police.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X