వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేంద్ర మంత్రులు రాజీనామా, క్యాబినెట్ పునర్వవ్యస్థీకరణ!

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఇద్దరు కేంద్ర మంత్రులు గురువారం నాడు అర్ధరాత్రి రాజీనామా చేశారు. రాజీవ్ ప్రతాప్ రూఢీ, ఉమా భారతిలు తమ మంత్రి పదవులకు రాజీనామా చేశారు. మరో ఐదుగురు మంత్రులు కూడ రాజీనామా చేయనున్నారు.

కేంద్ర మంత్రి పదవికి రాజీవ్ ప్రతాప్ రూఢీ గురువారం రాత్రి రాజీనామా చేశారు. రెండు, మూడు రోజుల్లో కేంద్ర మంత్రివర్గంలో మార్పులు చేర్పులు చేసే అవకాశం ఉన్నందున రాజీవ్ మంత్రిపదవికి రాజీనామా చేయడం ప్రాధాన్యత ఏర్పడింది

కేంద్ర స్కిల్స్ డెవలప్‌మెంట్ పదవికి రాజీవ్ రాజీనామా చేశారు. కేంద్ర మంత్రివర్గంలో జెడియూ, అన్నాడిఎంకె కూడ కేంద్ర మంత్రివర్గంలో చేరే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది.

Ahead of Cabinet reshuffle, BJP's Rajiv Pratap Rudy resigns to make way for JD-U ministers

సెప్టెంబర్ 1 లేదా రెండవ తేదిన మోడీ తన మంత్రివర్గంలో మార్పులు చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ మేరకు అమిత్‌షా తన నివాసంలో 8 మంది కేంద్ర మంత్రులతో గురువారం సాయంత్రం సమావేశమయ్యారు.

అయితే గుజరాత్ ఎన్నికలతో పాటు కేంద్ర మంత్రివర్గంలో మార్పులు, చేర్పులను పురస్కరించుకొని అమిత్‌షా నివాసంలో పార్టీ నేతల వరుస సమావేశాలు ప్రాధాన్యతను సంతరించుకొన్నాయి.

మరో కేంద్ర మంత్రి ఉమాభారతి కూడ మంత్రిపదవికి రాజీనామా చేశారు. మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణను దృష్టిలో ఉంచుకొని ఈ ఇద్దరు మంత్రులు రాజీనామా చేశారని సమాచారం.

వీరితో పాటు మరో ఐదుగురు మంత్రులు కూడ రాజీనామా చేస్తారని సమాచారం. ప్రధానమంంత్రి మోడీ చైనా పర్యటనకు ఈ నెల 3వ, తేదిన బయలుదేరనున్నారు. ఆ లోపుగానే మంత్రివర్గ పునర్వవ్యస్థీకరణ జరిగే అవకాశం లేకపోలేదు.

English summary
Rajiv Pratap Rudy, Minister of State (Independent Charge) for Skill Development & Entrepreneurship, has resigned, according to various media reports.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X