• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఎన్నికల ముందు బీజేపీ జనాభా బాంబు -యూపీలో ఇద్దరు పిల్లల విధానం -కాదంటే పథకాలు, ఉద్యోగాలు కట్

|

దేశంలోనే అత్యధిక జనాభా కలిగి, అతిపెద్ద రాష్ట్రంగా కొనసాగుతోన్న ఉత్తరప్రదేశ్ లో అధికార బీజేపీ.. సరిగ్గా అసెంబ్లీ ఎన్నికల వేళ అనూహ్య విధానాన్ని తీసుకొచ్చింది. హిందువుల కంటే ముస్లింల జనాభా పెరిగిపోతోందంటూ గగ్గోలు పెట్టే బీజేపీ నేతలు ఇప్పుడు ప్రభుత్వ యంత్రాంగం ద్వారానే జననాలను కట్టడి చేయనున్నారు. ముస్లిం జనాభా అధికంగా ఉండే అస్సాంలో ఇప్పటికే ఈ ప్రయత్నాలను ఆరంభించిన బీజేపీ.. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ లోనూ ఇద్దరు పిల్లల విధానాన్ని తీసుకురానుంది.

ఏ వేవ్, ఎప్పడొస్తదో తెలియట్లేదు -ప్రభుత్వాలకూ అవగాహన కరువు -మళ్లీ ఫీవర్ సర్వే: కరోనాపై కేసీఆర్ఏ వేవ్, ఎప్పడొస్తదో తెలియట్లేదు -ప్రభుత్వాలకూ అవగాహన కరువు -మళ్లీ ఫీవర్ సర్వే: కరోనాపై కేసీఆర్

రేపే ముసాయిదా విడుదల!

రేపే ముసాయిదా విడుదల!

జనాభా నియంత్రణను ప్రోత్సహించేందుకు యోగి ఆదిత్యనాథ్ సారథ్యంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఒక బిల్లును సిద్ధం చేసింది. ఆ రాష్ట్ర లా బోర్డు సిద్ధం చేసిన సదరు బిల్లు ముసాయిదాలోని కీలక అంశాలు శనివారం వెలుగులోకి వచ్చాయి. ఉత్తరప్రదేశ్ పాపులేషన్ (నియంత్రణ, స్థిరీకరణ, సంక్షేమ) యాక్ట్-2021 తొలి ముసాయిదాను ఈనెల 11న(ఆదివారం) ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా విడుదల చేయాలని యోగి సర్కార్ భావిస్తోంది. ప్రస్తుతానికి ముసాయిదా రూపంలో ఉన్న ఆ బిల్లు చట్టంగా రూపొందిన తర్వాత ఇద్దరు లేదా అంతకంటే తక్కువ మంది పిల్లలు ఉన్నవారికే మాత్రమే ప్రభుత్వ సంక్షేమ పథకాలు వర్తిస్తాయి. స్థానిక ఎన్నిక‌ల్లోనూ వాళ్లు పోటీప‌డే ఛాన్సు లేదు.

జ్యోతిరాదిత్య సింధియాకు అనూహ్య టాస్క్ -మంత్రిగా మొదటి పని ఇదే -ఇచ్చింది ప్రధాని మోదీ కాదుజ్యోతిరాదిత్య సింధియాకు అనూహ్య టాస్క్ -మంత్రిగా మొదటి పని ఇదే -ఇచ్చింది ప్రధాని మోదీ కాదు

ఇద్దరు కంటే ఎక్కువైతే అన్నీ కట్

ఇద్దరు కంటే ఎక్కువైతే అన్నీ కట్

ఇద్దరు కంటే ఎక్కువ మంది పిల్లలుంటే సదరు వ్యక్తులకు ప్రభుత్వ ఉద్యోగాలు, ప్రోత్సాహకాలు లభించవు. ఈనెల 11న విడుదల కానున్న ముసాయిదాపై 10 రోజుల్లోగా ప్రజలు తమ స్పందన తెలపాలని యూపీ స్టేట్ లా కమిషన్ కోరనుంది. జూలై 19వ తేదీ వరకూ అభ్యంతరాల స్వీకరణకు గడువుగా నిర్దేశించించనుంది. ప్రజాభిప్రాయ సేకరణ అనంతరం యూపీ పాపులేషన్ బిల్లును రాష్ట్ర ప్రభుత్వానికి కమిషన్ అందించనుంది.

ఇద్దరితో సరిపెడితే ఇవీ లాభాలు

ఇద్దరితో సరిపెడితే ఇవీ లాభాలు

చైనా తరహాలో ఇద్దరు పిల్లల విధానాన్ని ప్రోత్సహించనున్న యోగి సర్కారు.. నిబంధనలు పాటించినవారికి ప్రోత్సాహ‌కాలు కూడా ఇవ్వనుంది. స్వ‌చ్ఛంధంగా కుటుంబ నియంత్రణ ఆప‌రేష‌న్ చేసుకున్న‌వారికి.. సాధార‌ణ వడ్డీ రేటుతో ఇండ్ల నిర్మాణం కోసం రుణాలు ఇవ్వాలని,. నీరు, విద్యుత్తు, ఇంటి ప‌న్నుల్లో రిబేట్ ఇస్తారని, ఒక బిడ్డ‌నే క‌న్న త‌ర్వాత ఆప‌రేష‌న్ చేయించుకున్న‌వారికి ఉచిత ఆరోగ్య స‌దుపాయాలు, ఆ బిడ్డ 20 ఏళ్ల వ‌చ్చే వ‌ర‌కు బీమా, ఐఐఎం, ఏయిమ్స్ లాంటి విద్యాసంస్థ‌ల్లో ఆ పిల్ల‌ల‌కు అడ్మిష‌న్ సులువుగా ల‌భిస్తుంద‌ని ముసాయిదా బిల్లులో పేర్కొన్నారు. ఒక్క సంతానమే చాలు అనుకునే ఉద్యోగులకు నాలుగు అద‌న‌పు ఇంక్రిమెంట్లు ఇవ్వ‌నున్న‌ట్లు, దారిద్య్ర‌రేఖ‌కు దిగువ‌న ఉన్న‌వారు ఒక్క‌రినే కంటే.. ఒక‌వేళ అబ్బాయితే 80 వేల‌, అమ్మాయి అయితే ల‌క్ష ఇవ్వ‌నున్నట్లు ముసాయిదాలో రాసుకొచ్చారు.

ఆ వర్గాలనే టార్గెట్ చేయాలన్న సీఎం

ఆ వర్గాలనే టార్గెట్ చేయాలన్న సీఎం

ప్రత్యేక వర్గాల్లో జనాభా నియంత్రణపై అవగాహన లేకపోవడాన్ని ప్రస్తావిస్తూ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని పరిమిత వనరుల కారణంగా జనాభాను నియంత్రించాల్సిన అవసరమం ఉందని రాష్ట్ర ముసాయిదా చట్టం పేర్కొంటోంది. జనాభా నియంత్రణకు కమ్యూనిటీ-సెంట్రిక్ అప్రోచ్ ఉండాలి సీఎం యోగి పిలుపునిచ్చారు. అందువల్ల వనరులు సక్రమంగా ప్రజలకు చేరి రాష్ట్రం సరైన రీతిలో అభివృద్ధి సాధిస్తుందని ఆయన అంటున్నారు. ''జనాభా పెరగడానికి పేదరికం, నిరక్షరాస్యత కీలక కారణాలు. కొన్ని కమ్యూనిటీల్లో దీనిపై (జనాభా నియంత్రణ) అవగాహన లేదు. అందువల్ల కమ్యూనిటీ సెంట్రిక్ అవేర్‌నెస్ తీసుకురావాలి'' అని యోగి ఓ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ముస్లింలలో భిన్నాభిప్రాయం

ముస్లింలలో భిన్నాభిప్రాయం


యూపీ జ‌నాభా నియంత్రణ బిల్లు 2021 కేవ‌లం ముస్లింల‌ను టార్గెట్ చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌స్తున్నా.. వ‌చ్చే ఏడాది యూపీలో జ‌ర‌గ‌బోయే అసెంబ్లీ ఎన్నిక‌లపై ఇది ప్ర‌భావం చూపే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. కాగా, ఇస్లాం అనుమతిచ్చే బ‌హుభార్య‌త్వం విష‌యంలో వేరు వేరు సంతానాన్ని ప‌రిగ‌ణ‌లోకి తీసుకోవాలని ముసాయిదాలో పేర్కొన్నారు. ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వం కల్పించే సీఏఏ చట్టంపై గతేడాది దేశవ్యాప్తంగా నిరసనలు భగ్గుమనడం, అస్సాంలో జనాభా నియంత్రణ ప్రక్రియపై అధికార బీజేపీ ముస్లిం పెద్దలతో కసరత్తులు చేస్తుండటం తెలిసిందే. ఎన్నికల వేళ బాంబు అంతటి కలకలం సృష్టించే అవకాశమున్న జనాభా నియంత్రణ బిల్లు యూపీలో ఎలాంటి రాజకీయ మార్పులకు కారణమవుతుందో చూడాలి..

English summary
The Uttar Pradesh State Law Commission released the first draft of the proposed population control bill on Friday. The draft bill has provisions to debar people who have more than two children from the benefits of government schemes and perks to those who follow the two-child policy. UP State Law Commission Chairman Justice AN Mittal told media that the bill proposes to bar the violators of the two-child policy from contesting local body elections or applying for government jobs. The bill also limits ration card units to four.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X