వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కరోనా: జనవరి 8న మరోసారి దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ డ్రైరన్ -13నుంచి టీకాల పంపిణీ నేపథ్యంలో..

|
Google Oneindia TeluguNews

కరోనా మహమ్మారికి అడ్డుకట్ట వేసే దిశగా దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వచ్చే వారం నుంచి ప్రారంభం కానుండగా.. టీకాల పంపిణీని మరింత సమర్థవంతంగా చేపట్టడం కోసం మరోసారి దేశవ్యాప్తంగా వ్యాక్సిన్ డ్రైరన్ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈనెల 8న దేశంలోని అన్ని జిల్లాల్లో వ్యాక్సిన్ డ్రైరన్ చేపట్టనున్నట్లు కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం రాత్రి ఒక ప్రకటన చేసింది.

Recommended Video

COVID-19 Vaccine Dry Run in India దేశవ్యాప్తంగా డమ్మీ వ్యాక్సిన్ డ్రైరన్ -వచ్చే వారం అసలైన టీకాలు..!

బర్డ్ ఫ్లూ విలయం: చికెన్, గుడ్లు తింటున్నారా? -అన్ని రాష్ట్రాలకు కేంద్రం కీలక మార్గదర్శకాలుబర్డ్ ఫ్లూ విలయం: చికెన్, గుడ్లు తింటున్నారా? -అన్ని రాష్ట్రాలకు కేంద్రం కీలక మార్గదర్శకాలు

టీకా సరఫరా, పంపిణీ, వ్యాక్సినేషన్‌ మొదలుకొని ప్రతి అంశంపై పరిశీలన జరిపి, వాస్తవ వ్యాక్సినేషన్‌ను ఎలాంటి అవాంతరాలు లేకుండా అమలు చేయడమే లక్ష్యంగా ఇప్పటికే జనవరి 2న దేశ వ్యాప్తంగా తొలి దశ డ్రైరన్ నిర్వహించారు. 125 జిల్లాల్లోని 285 కేంద్రాల్లో డమ్మీ టీకాలను పంపిణీ చేయడం ద్వారా ప్రక్రియ తీరును తెలుసుకోగలిగారు. డ్రై రన్‌ డాటా ఆధారంగానే వ్యాక్సినేషన్‌ ప్రారంభించాలని కేంద్రం ప్రాథమికంగా నిర్ణయించిన దరిమిలా శుక్రవారం(జనవరి 8న) మరోసారి డ్రైరన్ నిర్వహించనున్నారు.

 Ahead of COVID-19 vaccine roll out, second dry run on January 8 across india

కొవిషీల్డ్‌, కొవాగ్జిన్‌ టీకాలకు అత్యవసర వినియోగ అనుమతులు లభించిన విషయాన్ని ఉదహరిస్తూ.. అనుమతి లభించిన నాటి నుంచి (జనవరి 3) పది రోజుల్లోగా, అంటే జనవరి 13 నుంచి ప్రజలకు సదరు టీకాలను వేయటం మొదలుపెడుతామని కేంద్రం ఇదివరకే స్పష్టం చేసిన నేపథ్యంలో రెండో విడత డ్రైరన్ కీలకంగా మారింది. మరోవైపు..

కొడాలి నానికి బాలకృష్ణ వార్నింగ్.. నోరు అదుపులో పెట్టుకో -మాట వినకుంటే ఇక చేతలే..కొడాలి నానికి బాలకృష్ణ వార్నింగ్.. నోరు అదుపులో పెట్టుకో -మాట వినకుంటే ఇక చేతలే..

కరోనా వ్యాక్సినేషన్‌ ప్రక్రియను సమర్థవంతంగా అమలు చేసేందుకు కేంద్రం కొవిన్ యాప్ ను రూపొందించగా, ఆ యాప్ ను పోలిన నకిలీ కోవిన్‌ యాప్‌లు కొన్నింటిని కేంద్రం గుర్తించింది. నకిలీ కోవిన్‌ యాప్‌లను డౌన్‌లోడ్‌ చేసుకోవద్దని కేంద్రం సూచించింది. వ్యాక్సిన్‌ పేరుతో మోసాలకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించింది. ప్రభుత్వం తెచ్చే యాప్‌లపై విస్తృతంగా ప్రచారం చేస్తామని కేంద్రం తెలిపింది.

English summary
Ahead of COVID-19 vaccine roll-out, the second dry run of the program will take place on January 8 in all districts of the country, the government said on Wednesday. Previously, a dry run for COVID-19 vaccination was conducted by all state and union territories on January 2.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X