మోడీ అభిమానులు, వ్యతిరేకుల ట్విట్టర్ యుద్ధం: టాప్ ట్రెండింగ్లో ఇవే
చెన్నై: ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం నాడు తమిళనాడులో పర్యటిస్తున్నారు. ఆల్ ఇండియా ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)కు పునాదిరాయి వేసేందుకు ఆయన మధురై వస్తున్నారు. ఈ నేపథ్యంలో మోడీ అభిమానులు, మోడీ వ్యతిరేక పార్టీలు ట్విట్టర్ యుద్ధానికి దిగాయి. ట్విట్టర్ అకౌంట్లోని టాప్ 10లో మోడీకి వ్యతిరేకంగా, మోడీకి అనుకూలంగానే ఉన్న ట్వీట్లు టాప్ ట్రెండింగులో ఉన్నాయి.
#GoBackModi, #MaduraiThanksModi, #TNWelcomesModi, #GoBackSadistModi, Tamilnadu టాప్ ట్రెండింగులో ఉన్నాయి.
ప్రధాని నరేంద్ర మోడీని ప్రశంసించుకుంటూ అభిమానులు, బీజేపీ నాయకులు, మోడీ రాకను వ్యతిరేకిస్తూ ఆయన వ్యతిరేకులు, ఆయన వ్యతిరేక పార్టీలు ట్విట్టర్ యుద్ధానికి దిగాయి.
ఈ ట్వీట్స్లలో ఎంతోమంది కార్టూన్లు ఉపయోగిస్తున్నారు. మోడీకి వ్యతిరేకంగా, అనుకూలంగా కార్డూన్లు పోస్ట్ చేశారు. అదే సమయంలో తమిళనాడు అభివృద్ధికి బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందుకు అనుగుణంగా ఎయిమ్స్ ఫౌండేషన్ కోసం వస్తున్నారని పేర్కొంటున్నారు.