వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విషాదం: కొడుకు పుట్టిన రోజుకు ఆ తండ్రి వస్తానన్నాడు.. వచ్చాడు.. కానీ శవమై!

‘నీ పుట్టినరోజుకు తప్పకుండా వస్తాను రా..’ అని ఆ తండ్రి తన కొడుక్కి మాటిచ్చాడు. ఇంతలోనే విధి వెక్కిరించింది. కొడుకు పుట్టినరోజు వేడుకలు దగ్గరుండి పర్యవేక్షించాల్సిన ఆ తండ్రి.. ఇప్పుడు శవమై తిరిగొచ్చాడు

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

ముంబై: 'నీ పుట్టినరోజుకు తప్పకుండా వస్తాను రా..' అని ఆ తండ్రి తన కొడుక్కి మాటిచ్చాడు. ఇంతలోనే విధి వెక్కిరించింది. కొడుకు పుట్టినరోజు వేడుకలు దగ్గరుండి పర్యవేక్షించాల్సిన ఆ తండ్రి.. ఇప్పుడు శవమై తిరిగొచ్చాడు.

చదవండి: ప్రేమ ఓకే, పెళ్లికి మాత్రం నో అన్నాడు.. బాత్రూంలోకి తీసుకెళ్లి కోసి పారేసింది

పాక్ సైనికుల చేతిలో బలై దేశం కోసం ప్రాణత్యాగం చేసిన ఆ తండ్రి.. మహారాష్ట్రకు చెందిన జవాను సందీప్‌ జాదవ్‌. జమ్ముకశ్మీర్‌ పూంఛ్‌ జిల్లాలోని నియంత్రణ రేఖ వద్ద శుక్రవారం పాక్‌ సైన్యం జరిపిన కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు అమరులైన విషయం తెలిసిందే.

indian-soldier

వారిలో ఒకరు మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన సందీప్‌సింగ్‌. సందీప్‌ కుమారుడు శివమ్‌ శనివారం పుట్టిన రోజు జరుపుకోవాల్సి ఉంది. ఎప్పటి నుంచో విధుల్లో ఉన్న సందీప్‌ సెలవు తీసుకుని కొడుకు పుట్టిన రోజు నాటికి వస్తానని కుటుంబ సభ్యులకు కూడా చెప్పాడు.

కానీ ఇంతలోనే జరగరానిది జరిగిపోయింది. అంతులేని విషాదం చోటుచేసుకుంది.
శనివారం సందీప్‌ మృతదేహాన్ని ఆయన స్వగ్రామం కాలేగావ్‌ కు తీసుకురానున్నారు. వేడుకలు జరిపించేందుకు రావాల్సిన వ్యక్తి.. ఇలా ప్రాణం లేకుండా తిరిగొస్తున్నాడన్న వార్త విని సందీప్‌ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.

సందీప్‌ మరణించాడని ముందు ఆయన తండ్రి సర్జేరావ్‌కు తెలిసింది. అయితే దుర్వార్త కుటుంబ సభ్యులకు తెలియకుండా ఉంచాలని ఆయన ఇంట్లోని టీవీలను ఆఫ్‌ చేశారట. అయితే శుక్రవారం సాయంత్రానికి జరిగిన ఘోరం కుటుంబ సభ్యులకు తెలిసిపోయి వారు దిగ్భ్రాంతికి గురయ్యారు.

English summary
Army jawan Sandeep Jadhav had promised to come home to celebrate the birthday of his son Shivam tomorrow, but to the utter devastation of his family the jawan will return home in a coffin.A pall of gloom descends on the jawans native Kalegao village in Sillod tehsil of Aurangabad district.The 34-year-old soldier, who belonged to the 15 Maratha Light Infantry, was yesterday killed in an attack by a team of Pakistani special forces, which had sneaked 600 metres across the Line of Control (LoC) into the Poonch sector of Jammu and Kashmir. When Jadhavs father Sarjerao learnt about his death, he decided not to play the television at home so that the family does not come to know about the fateful news.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X