• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సన్నీ లియోన్‌నే మించిపోయిన కేరళ కుట్టి!

By Ramesh Babu
|
  Priya Warrior Expression Goes Viral, Star Heros 'Fidaa'

  కొచ్చి: అదృష్టం ఉండాలేకానీ రాత్రికి రాత్రే సెలబ్రిటీ అయిపోవచ్చు. ప్రియా ప్రకాష్ వారియర్ విషయమే ఇందుకు ఉదాహరణ. ఈ కేరళ కుట్టి అలా కన్నుకొట్టి, ఇలా నవ్విందో లేదో సోషల్ మీడియా షేక్ అయింది.

  తన చర్యతో కోట్ల మంది కుర్రకారు గుండెల్ని మాత్రమేకాదు, సెలబ్రిటీలు కూడా నోరు తెరిచి కళ్లప్పగించేలా చేసేసింది ప్రియా వారియర్. రాత్రికి రాత్రే సోషల్ మీడియా క్వీన్ అయిపోయింది. ఏకంగా బాలీవుడ్ సెక్స్ బాంబ్ సన్నీలియోన్‌నే మించిపోయింది.

  కేరళ కుట్టికి నెటిజన్లు ఫిదా...

  కేరళ కుట్టి ప్రియా ‘ఓరు అదార్ లవ్' మూవీలో నటిస్తున్న సంగతి, వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ మూవీలోని ఓ సాంగ్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ పాటలో ప్రియా తన హావభావాలతో నెటిజన్ల మనసు దోచుకుంది.

  ఇన్‌స్టాగ్రామ్‌లో రాత్రికి రాత్రే...

  ఇన్‌స్టాగ్రామ్‌లో రాత్రికి రాత్రే...

  ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రియా వారియర్ ఫాలోవర్ల సంఖ్య రాత్రికి రాత్రే ఆరున్నర లక్షలు పెరిగింది. తాజాగా గూగుల్‌లో మోస్ట్ సెర్చ్‌డ్ సెలబ్స్ లిస్ట్‌లో బాలీవుడ్ సెక్స్ బాంబ్ సన్నీ లియోన్‌ను వెనక్కి నెట్టి తొలి స్థానంలో నిలిచింది ప్రియా.

   సన్నీలియోన్‌ని మించిపోయి...

  సన్నీలియోన్‌ని మించిపోయి...

  సోషల్ మీడియాలో ప్రియా వారియర్ వీడియో వైరల్ కాగానే.. అసలు ఎవరీ ప్రియా అంటూ నెటిజన్లు సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. గూగుల్ అనలిటిక్స్ రిపోర్ట్‌లో కూడా ప్రియా.. సన్నీలియోన్‌ని మించినట్లు తేలింది.

  ఒక్క సినిమా విడుదల కాకుండానే...

  ప్రస్తుతం ఈ ఇద్దరి తర్వాతి స్థానాల్లో కత్రినా కైఫ్, అనుష్క శర్మ, దీపికా పదుకోన్ ఉన్నారు. విచిత్రం ఏమిటంటే... 18 ఏళ్ల ఈ కేరళ కుట్టి నటించిన ఒక్క సినిమా కూడా విడుదల కాకుండానే పెద్ద స్టార్ అయిపోయింది. ఇంత రెస్పాన్స్ వస్తుందని తాను ఊహించలేదని ప్రియా సంబరపడుతోంది. మరి సోషల్ మీడియానా.. మజాకా?

  English summary
  Love is in the air this Valentine's and couples are busy planning what they would do on the special day. While Sunny Leone was the most-searched Bollywood actress a few days ago, she now has competition!The new internet sensation, Priya Prakash, whose video went viral on social media few days ago has dethroned Sunny as the most-searched celeb on google! After Sunny, it's Katrina Kaif, Anushka Sharma, and Deepika Padukone on the most-searched list! Don't believe us? Check out the Google analytics bar right here. Priya Prakash Varrier, the eighteen-year-old girl from Thrisshur in Kerala, made netizens go crazy over her mesmerising expressions in a viral video. Priya became a celebrity overnight after a short clip from the song Manikya Malaraya Poovi from Omar Lulu’s upcoming Malayalam movie Oru Adaar Love went viral on social media. The song sung by Vineeth Sreenivasan and composed by Shaan Rahman became popular but it was Priya who stole the show.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more