వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అహ్మద్ పటేల్ కుమారుడికి మోడీ ఫోన్: కాంగ్రెస్ బలోపేతం ఆయన వల్లే: రాహుల్, ప్రియాంకా సంతాపం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: అఖిల భారత కాంగ్రెస్ కమిటీ సీనియర్ నేత అహ్మద్ పటేల్ మృతి పట్ల దేశవ్యాప్తంగా సంతాపాలు వెల్లువెత్తుతున్నాయి. అన్ని పార్టీల నేతలు స్పందిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా, ఏఐసీసీ మాజీ అధినేత, లోక్‌సభ సభ్యుడు రాహుల్ గాంధీ, ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా వంటి అగ్ర నేతలు అహ్మద్ పటేల్ మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. అహ్మద్ పేటల్ చేసిన సేవలను గుర్తు చేసుకుంటున్నారు.

Recommended Video

Ahmed Patel : PM Modi, Rahul Pay Tribute కాంగ్రెస్ మూల స్తంభం, ఏఐసీసీకి ఖజానా వంటి నేత అహ్మద్ పటేల్‌

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సంతాపం తెలిపారు. ఆయన మరణం తనను కలచి వేసిందని చెప్పారు. తన జీవితాన్ని ప్రజాసేవకు అంకితం చేశారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో అహ్మద్ భాయ్ పాత్ర చిరస్మరణీయమైనదని మోడీ పేర్కొన్నారు. చురుకైన నిర్ణయాలను తీసుకోవడంలో ఆయనకు సాటిలేరని చెప్పారు. ఆయన కుమారుడు ఫైజల్ పటేల్‌తో ఫోన్‌లో మాట్లాడానని, తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశానని అన్నారు. ఈ మేరకు ఆయన ఓ ట్వీట్ చేశారు.

Ahmed Patel role in strengthening the Congress party would always be remembered: Modi

కాంగ్రెస్ పార్టీ కోసం చివరి శ్వాస వరకూ అహ్మద్ పటేల్ కృషి చేశారని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. కాంగ్రెస్ మూల స్తంభంగా నిలిచారని చెప్పారు. ఏఐసీసీకి ఖజానా వంటి నేతగా అహ్మద్ పటేల్‌ను అభివర్ణించారు. పార్టీ కష్టకాలంలో ఉన్న ప్రతీసారీ ఆయన ఇచ్చిన సలహాలు, సూచనలు అద్భుతంగా పనిచేశాయని అన్నారు. క్షేత్రస్థాయిలో కాంగ్రెస్ బలోపేతం కావడంలో ఎనలేని కృషి చేశారని చెప్పారు. ఆయన సేవలను ఏ మాత్రం విస్మరించలేమని అన్నారు. ఫైజల్, ముంతాజ్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలుపుతున్నట్లు రాహుల్ గాంధీ చెప్పారు.

అహ్మద్ పటేల్ మరణ వార్త తెలిసిన వెంటనే తాను దిగ్భ్రాంతికి లోనయ్యానని ప్రియాంకాగాంధీ వాద్రా పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీకి అత్యంత విధేయుడైన నేతల్లో ఆయన ఒకరని, సీనియర్ రాజకీయ వేత్త అయినప్పటికీ.. ఓ స్నేహితుడిలా మెలిగేవాడని చెప్పారు. కాంగ్రెస్‌ను బలోపేతం చేయడంలో సలహాలు, సూచనలు గొప్పగా పనిచేశాయని, ఆయన మరణం పార్టీకి తీరనిలోటు అని ప్రియాంకా గాంధీ పేర్కొన్నారు. ఏఐసీసీలో ఆయన స్థానాన్ని మరొకరు భర్తీ చేయలేరని చెప్పారు.

English summary
Prime Minister Narendra Modi condoles death of Congress leader Senior Congress leader Ahmed Patel, says, "his role in strengthening the Congress party would always be remembered".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X