బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అహ్మదాబాదు నుంచి బెంగళూరు వెళ్లే విమానంలో చెలరేగిన మంటలు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఈ మధ్యకాలంలో విమాన ప్రమాదాలు చాలా జరుగుతున్నాయి. కొద్ది రోజుల క్రితం పూణే రన్‌వేపై హఠాత్తుగా ఓ వాహనం రావడంతో పైలట్ విమానంను గాల్లోకి లేపడంతో విమానం కింది భాగం ధ్వంసమైంది. ఈ ఘటన మరువక ముందే గో ఎయిర్ విమానాయాన సంస్థకు చెందిన విమానంలో మంటలు చెలరేగాయి.అహ్మదాబాదు నుంచి బెంగళూరుకు ఈ విమానం వెళుతుండగా ఈ ప్రమాదం సంభవించింది.

అహ్మదాబాదు నుంచి బెంగళూరుకు వెళుతున్న జీ8 802 గోఎయిర్ విమానంలో హఠాత్తుగా మంటల చెలరేగాయి. అయితే వెంటనే మంటలు ఆర్పివేయడంతో పెద్ద ప్రమాదం తప్పింది. మంటలు చెలరేగగానే సిబ్బంది అలర్ట్ అయ్యారని వెంటనే మంటలను ఆర్పివేయడంతో విమానంలోని ప్రయాణికులు, సిబ్బంది క్షేమంగా ఉన్నట్లు గోఎయిర్ సంస్థ ఒక ప్రకటన విడుదల చేసింది.

Ahmedabad to Bengaluru GoAir flight G8 802 catches fire during takeoff, Passengers safe

ఇక విమానంలోని ప్రయాణికులను కిందకు దింపి వారిని మరో విమానంలో తమ గమ్యస్థానాలకు చేర్చే ఏర్పాటు చేసినట్లు ప్రకటనలో వెల్లడించింది. మధ్యాహ్నం ఈ విమానం బయలుదేరి వెళుతుందని ప్రస్తుతం బెంగళూరు రన్‌వేను మూసివేయడంతో ఆలస్యం అయ్యే అవకాశం ఉందని పేర్కొంది. ఈ మధ్యలో ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని సదుపాయాలు చేశామని ప్రకటనలో పేర్కొంది గోఎయిర్ సంస్థ.

Recommended Video

Coronavirus : Isolation Wards For Indians Came In Air India Flight From China's Wuhan | Oneindia

అహ్మదాబాదు నుంచి బెంగళూరుకు వెళ్లే గోఎయిర్ విమానం కుడి ఇంజిన్‌లో సాంకేతికలోపం తలెత్తింది. అయితే ఓ పక్షి ఢీకొనడంతోనే ఇది జరిగిందని గోఎయిర్ సంస్థ వెల్లడించింది. టేకాఫ్ తీసుకునే సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు పేర్కొంది. పక్షి ఢీ కొనగానే స్వల్పంగా మంటలు చెలరేగినట్లు సంస్థ తెలిపింది. అయితే ప్రయాణికులను ఎమర్జెన్సీ పద్ధతిలో కిందకు దించలేదని చెప్పిన గోఎయిర్ సంస్థ అంతా క్షేమంగా ఉన్నట్లు తెలిపింది. అంతేకాదు ప్రయాణికులు సిబ్బంది సురక్షితంగా ఉండటమే తమ ప్రాధాన్యమని ఎవరికైన ఇబ్బంది కలిగి ఉంటే క్షమించాల్సిందిగా గోఎయిర్ సంస్థ ప్రకటనలో తెలిపింది.

English summary
the airline said. The fire has been, however, doused and all passengers and crew are safe.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X