భారత్ చేరుకున్న బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్.. ఘన స్వాగతం పలికిన గుజరాత్ గవర్నర్, సీఎం
బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ భారత్ విచ్చేశారు. ఉదయం అహ్మదాబాద్ చేరుకున్నారు. ఆయనకు గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవరాత్, సీఎం భూపేంద్ర పాటేల్ ఘన స్వాగతం పలికారు. జోరిస్ జాన్సన్‌కు గుజరాత్ చీఫ్ సెక్రటరీ, గుజరాత్ డీజీ అశిష్ భాటియా, జిల్లా కలెక్టర్, అహ్మదాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ తదితరులు కూడా స్వాగతం పలికారు. ఈ పర్యటనలో వర్తకం, ఎనర్జీ విభాగం, రక్షణ రంగాల గురించి చర్చలు జరిగే అవకాశం ఉంది.
జాన్సన్ సాయంత్రం వరకు గుజరాత్లో ఉంటారు. రాత్రి భోజనం చేసిన తర్వాత ఢిల్లీ బయలుదేరతారు. జాన్సన్ ఇదివరకే భారత పర్యటన ఖరారు అయ్యింది. అయితే కరోనా వల్ల అది రద్దయిన సంగతి తెలిసిందే. మళ్లీ ఇప్పుడు భారత్.. గుజరాత్‌కు తొలిసారి విచ్చేశారు.
UK PM Boris* Johnson arrives in Ahmedabad, Gujarat. He is on a 2-day India visit pic.twitter.com/yzwlX5Dppg
— ANI (@ANI) April 21, 2022

రష్యా ఉక్రెయిన్ యుద్దం కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. అయితే రష్యాపై బ్రిటన్ ఆగ్రహాంతో ఉంది. ఈ విషయంలో భారత్ తటస్థంగానే ఉంది. పైకి ఉక్రెయిన్ అంటే మద్దతు తెలుపుతున్నట్టు ఉంటూ.. మందులు, ఇతర సామాగ్రి అందజేస్తున్నారు. ఈ సమంలో భారత పర్యటనకు వచ్చిన బోరిస్ జాన్సన్.. భారత ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అవుతారు. రష్యా-ఉక్రెయిన్ గురించి వీరి మధ్య చర్చకు రానున్నట్టు విశ్వసనీయ సమాచారం. దీనిపై జాన్సన్ ప్రస్తావించే అవకాశం ఎక్కువగా ఉంది.