వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తమిళనాడు సీఎం మీద తిరుబాటు; 18 మంది ఎమ్మెల్యేల కేసు విచారణ వాయిదా, టెన్షన్ !

తమిళనాడు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి అనర్హత వేటుకు గురైన 18 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల పిటిషన్ విచారణ వాయిదా పడింది. నవంవర్ 2వ తేదీ పిటిషన్ విచారణ చేస్తామని సోమవారం మద్రాస్ హైకోర్టు చెప్పింది.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి అనర్హత వేటుకు గురైన 18 మంది అన్నాడీఎంకే ఎమ్మెల్యేల పిటిషన్ విచారణ వాయిదా పడింది. నవంవర్ 2వ తేదీ పిటిషన్ విచారణ చేస్తామని సోమవారం మద్రాస్ హైకోర్టు చెప్పింది. పిటిషన్ విచారణ వాయిదా పడటంతో రెబల్ ఎమ్మెల్యేలకు మళ్లీ టెన్షన్ మొదలైయ్యింది.

శశికళ భజన చేసిన తమిళనాడు మంత్రి: సీఎం పళని మీద అసంతృప్తి, స్లీపర్ సెల్ మంత్రి కాదు !శశికళ భజన చేసిన తమిళనాడు మంత్రి: సీఎం పళని మీద అసంతృప్తి, స్లీపర్ సెల్ మంత్రి కాదు !

నవంబర్ 2వ తేది వరకు తమిళనాడు అసెంబ్లీలో సీఎం ఎడప్పాడి పళనిసామి బలపరీక్ష నిర్వహించరాదని, 18 శాసన సభ నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించరాదని మద్రాసు హైకోర్టు సూచించింది. ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వం ఒక్కటి కావడం టీటీవీ దినకరన్ గ్రూప్ కు చెందిన ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోయారు.

AIADMK 18 MLAs disqualification case adjourned to November 2

అన్నాడీఎంకే పార్టీ నుంచి శశికళ, టీటీవీ దినకరన్ ను శాశ్వతంగా బహిష్కరించడంతో 18 మంది ఎమ్మెల్యేలు తమిళనాడు ప్రభుత్వం మీద తిరుగుబాటు చేసి రిసార్ట్ రాజకీయాలు చేశారు. ప్రభుత్వం, పార్టీ మీద తిరుబాటు చేసిన 18 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ ధనపాల్ మూడు సార్లు నోటీసులు ఇచ్చి సమాధానం చెప్పాలని ఆదేశించారు.

భర్త దగ్గర కొంత సేపు, చక్రం తిప్పుతున్న చిన్నమ్మ శశికళ, నిఘా వేసిన ఇంటలిజెన్స్ వర్గాలు!భర్త దగ్గర కొంత సేపు, చక్రం తిప్పుతున్న చిన్నమ్మ శశికళ, నిఘా వేసిన ఇంటలిజెన్స్ వర్గాలు!

తిరుగుబాటు ఎమ్మెల్యేల నుంచి స్పంధనలేకపోవడంతో అందరి మీద అనర్హత వేటు వేశారు. 18 నియోజక వర్గాల్లో ఉప ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషన్ కు ప్రభుత్వం లేఖ రాసింది. 18 మంది ఎమ్మెల్యేలు హైకోర్టును ఆశ్రయించడంతో విచారణ జరుగుతోంది.

English summary
The Madras High Court on Monday adjourned the AIADMK legislators' disqualification case to November 2 while reiterating that no floor test or by-election should take place in Tamil Nadu until then.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X