వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శశికళను ఎదిరించిన ఫలితం: పుష్ప లాయర్‌పై కార్యకర్తల దాడి, తీవ్ర గాయాలు

పార్టీ నుంచి బహిష్కరించబడిన రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప లాయర్ పైన అన్నాడీఎంకే కార్యకర్తలు బుధవారం నాడు చేయి చేసుకున్నారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: పార్టీ నుంచి బహిష్కరించబడిన రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప లాయర్ పైన, అలాగే పుష్ప భర్త పైన అన్నాడీఎంకే కార్యకర్తలు బుధవారం నాడు చేయి చేసుకున్నారు. ఈ ఘటన చెన్నైలోని పార్టీ కార్యాలయం ఎదుటే జరిగింది. లాయర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. రక్తం కారేటట్టు కొట్టారు.

శశికళకు చెక్, అన్ని వైపులా ఇలా కట్టడి!: పన్నీరుసెల్వంతో బీజేపీ పావులు? శశికళకు చెక్, అన్ని వైపులా ఇలా కట్టడి!: పన్నీరుసెల్వంతో బీజేపీ పావులు?

జయలలిత మృతికి శశికళనే కారణమని ఎంపీ శశికళ పుష్ప ఆరోపిస్తున్నారు. అంతేకాదు, శశికళ పుష్ప.. జయ నెచ్చెలి శశికళ నాయకత్వాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు. ఈ నేపథ్యంలో శశికళ పుష్ప భర్త లింగేశ్వరన్, ఆమె లాయర్ పైన పైన దాడి జరిగింది. ఆ లాయర్‌ను, శశికళ పుష్ప భర్తను పోలీసులు అక్కడి నుంచి తీసుకు వెళ్లారు. కాగా, శశికళ పుష్ప భర్త పైన హత్యాయత్నంగా చెబుతున్నారు.

పార్టీ కార్యాలయానికి ఎందుకు వచ్చారంటే..

అన్నాడీఎంకే పార్టీ సమావేశం ఈ నెల 29వ తేదీన జరగనుంది. శశికళను శశికళ పుష్ప వ్యతిరేకిస్తున్నారు. ఆమె పోటీ చేస్తే తాను కూడా బరిలో ఉంటానని చెప్పారు.

జయలలిత మృతి: శశికళ గురించి వెలుగు చూసిన షాకింగ్, ఏం చేయాలి?జయలలిత మృతి: శశికళ గురించి వెలుగు చూసిన షాకింగ్, ఏం చేయాలి?

ఇందులో భాగంగా శశికళ పుష్ప భర్త, ఆమె తరఫు లాయర్ ఆమె తరఫున పార్టీ చీఫ్ పదవికి నామినేషన్ వేసేందుకు కార్యాలయానికి వచ్చారు. ఈ సమయంలో చేయి చేసుకున్నారు. లాయర్‌తో పాటు భర్తకు కూడా గాయాలు కావడం గమనార్హం.

లాయర్, భర్తలు శశికళ పుష్పకు సంబంధించిన నామినేషన్ పత్రాలు తీసుకొని కార్యాలయ ఆవరణలోకి చేరాడు. అప్పుడు ఈ దాడి జరిగింది. కాగా, పార్టీలోని ఎక్కువ మంది సీనియర్లు, పలువురు నేతలు శశికళకు పార్టీ పగ్గాలు అప్పగించేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే. ఈ సమయంలో శశికళ పుష్ప పోటీ చేసేందుకు రావడం వారికి ఆగ్రహం తెప్పించిందని అంటున్నారు.

శశికళ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరిస్తుందనే ప్రచారం నేపథ్యంలో.

శశికళ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరిస్తుందనే ప్రచారం నేపథ్యంలో.

చెన్నైలోని అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాల‌యం ముందు బుధవారం తీవ్ర ఉద్రిక్త వాతావ‌ర‌ణం చోటు చేసుకుంది. అన్నాడీఎంకే పార్టీ ప్రాధాన కార్యదర్శిగా శ‌శిక‌ళే బాధ్య‌త‌లు చేప‌డ‌తార‌న్న ప్ర‌చారం ఊపందుకున్న సమయంలో.. పార్టీ బ‌హిష్కృత ఎంపీ శశికళ పుష్ప లాయర్, భర్త పార్టీ కార్యాల‌యానికి వచ్చారు. శశికళ పుష్ప కూడా పార్టీ చీఫ్ పదవికి పోటీ చేసేందుకు సన్నద్దమయ్యారు.

పార్టీ కార్యకర్తలు దాడి..

పార్టీ కార్యకర్తలు దాడి..

అయితే పార్టీ కార్యకర్తలు కొందరు శశికళ పుష్ప భర్త, ఆమె లాయర్ పైన దాడికి పాల్పడ్డారు. పార్టీ కార్యాలయం సమీపంలోనే కొట్టారు.

శశికళ పుష్ప తరఫున..

శశికళ పుష్ప తరఫున..

ఈ నెల 29వ తేదీన శశికళ నటరాజన్‌ను పార్టీ చీఫ్‌గా చేసేందుకు అంతా సన్నద్దమవుతుండగా.. శశికళ పుష్ప కూడా పోటీ చేసేందుకు సిద్ధమై.. పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఈ కారణంగా వారు దాడికి పాల్పడ్డారు.

మొదటి నుంచి ఆరోపణలు

మొదటి నుంచి ఆరోపణలు

అంతేకాదు, జయలలిత మృతికి శశికళ కారణమని శశికళ పుష్ప ఆరోపిస్తున్నారు. రేపు జరగనున్న అన్నాడీఎంకే పార్టీ సమావేశాన్ని అడ్డుకోవాలని ప్రయత్నించారు. లేదంటే పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇది శశికళ వర్గానికి ఆగ్రహం తెప్పించిందని అంటున్నారు.

శశికళ తరఫున రాగానే..

శశికళ తరఫున రాగానే..

శశికళ పుష్ప తరఫున వచ్చామని, లేఖ ఇస్తామని చెప్పగానే అక్కడున్న కార్యకర్తలు ఊగిపోయారు. అసలు శశికళ పుష్ప ఎవరని ఆగ్రహం వ్యక్తం చేస్తూ దాడికి పాల్పడ్డారు. వారిని పోలీసులు చెదరగొట్టారు.

English summary
Violence broke out as the lawyer visited the premises to submit Sasikala Pushpa's nomination to run against Sasikala Natarajan.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X