వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్‌.కె.నగర్: అన్నాడిఎంకెదే అధిపత్యం, కానీ, దినకరన్ విజయం

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు రాష్ట్రంలోని ఆర్ కె నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో టీటీవి దినకరన్ విజయం సాధించారు. అయితే ఇప్పటివరకు ఈ అసెంబ్లీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో అన్నాడిఎంకె అభ్యర్థులు 7 దఫాలు విజయం సాధించారు. అయితే ఈ స్థానం నుండి డిఎంకె అభ్యర్థులు రెండు దఫాలు మాత్రమే విజయం సాధించారు.

ఆర్‌కె నగర్ ఫలితాలు: తమిళనాడు రాజకీయాలపై ప్రభావం, ఎవరీ దినకరన్? ఆర్‌కె నగర్ ఫలితాలు: తమిళనాడు రాజకీయాలపై ప్రభావం, ఎవరీ దినకరన్?

తమిళనాడు రాజకీయాలను ఆర్ కె నగర్ ఉప ఎన్నికలు ప్రభావితం చూపే అవకాశాలున్నాయి. రెండు ప్రధాన పార్టీలను కాదని ఆర్ కె నగర్ ఉప ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థి దినకరన్ విజయం సాధించడం విశేషం.

దినకరన్ దెబ్బ: ఆర్.‌కె. నగర్‌లో జయలలిత వీడియో కలిసొచ్చిందా?దినకరన్ దెబ్బ: ఆర్.‌కె. నగర్‌లో జయలలిత వీడియో కలిసొచ్చిందా?

దేశ వ్యాప్తంగా ఆర్ కె నగర్ ఉప ఎన్నికల పలితాలపై చర్చ సాగుతోంది. ఆర్ కె నగర్ ఉప ఎన్నికల్లో అన్నాడిఎంకె ఓటమి పాలు కావడం ఆ పార్టీ నేతల్లో అసంతృప్తిని నింపుతోంది. అయితే ఈ ఎన్నికల ఫలితాలు రానున్న రోజుల్లో తమిళ రాజకీయాలపై ప్రభావం చూపే అవకాశం లేకపోలేదంటున్నారు విశ్లేషకులు.

ఏడుసార్లు అన్నాడిఎంకె అభ్యర్థులే విజయం

ఏడుసార్లు అన్నాడిఎంకె అభ్యర్థులే విజయం

ఆర్‌కె నగర్ అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడిఎంకె అభ్యర్థులు ఏడు దపాలు విజయం సాధించారు. 1977 నుండి ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఎక్కువసార్లు అన్నాడిఎంకె అభ్యర్థులే విజయం సాధించారు. డిఎంకె అభ్యర్థులు కేవలం రెండు దఫాలు మాత్రమే విజయం సాధించారు.ఈ నియోజకవర్గంలో అన్నాడిఎంకె ఆధిపత్యం ఉందని ఎన్నికల రికార్డులను పరిశీలిస్తే అర్ధమౌతోంది.

1977 నుండి అన్నాడిఎంకె హవా

1977 నుండి అన్నాడిఎంకె హవా

ఆర్ కె నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో 1977 నుండి అన్నాడిఎంకె హవా కొనసాగుతోంది.1977-80 వరకు అన్నాడిఎంకె కు చెందిన ఈ. వేలన్ ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. ఆ తర్వాత 1991లో ఈ. మధుసూధన్ ఈ స్థానం నుండి విజయం సాధించారు. తాజాగా జరిగిన ఉప ఎన్నికల్లో మధుసూధన్ ఈ స్థానం నుండి పోటీ చేసి ఓటమిపాలయ్యారు.2001 నుండి 20011 వరకు శేఖర్ బాబు రెండు దఫాలు వరుసగా ఈ స్థానం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు.2011 నుండి 2015 వరకు వెట్రివేల్ ప్రాతినిథ్యం వహించారు. 2015లో జరిగిన ఉప ఎన్నికల్లో జయలలిత ఈ స్థానం నుండి విజయం సాధించారు. 2016లో కూడ ఆమె ఇదే స్థానం నుండి పోటీ చేసి విజయం సాధించారు.ఆమె మరణంతో ప్రస్తుతం ఉప ఎన్నికలు జరిగాయి.కానీ, ఈ ఎన్నికల్లో ఎందుకు అన్నాడిఎంకె అభ్యర్థి ఓటమి పాలయ్యారనే దానిపై సర్వత్రా చర్చ సాగుతోంది.

రెండు సార్లే డిఎంకె

రెండు సార్లే డిఎంకె

ఆర్ కె నగర్ అసెంబ్లీ స్థానానికి జరిగే ఉప ఎన్నికల్లో డిఎంకె అభ్యర్థులు రెండు దఫాలు మాత్రమే విజయం సాధించారు.1989 నుండి 1991 వరకు డిఎంకె అభ్యర్థి ఎస్పీ సర్కుణం ఈ స్థానం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. 1996 నుండి 2001 వరకు మరోసారి ఎస్పీ సర్కుణం ఈ స్థానం నుండి విజయం సాధించారు.

కాంగ్రెస్ పార్టీ ఒక్కసారే

కాంగ్రెస్ పార్టీ ఒక్కసారే

కాంగ్రెస్ పార్టీ ఒకే ఒక్కసారి ఆర్ కె నగర్ అసెంబ్లీ స్థానం నుండి విజయం సాధించింది. 1984 నుండి 1989 వరకు కాంగ్రెస్ పార్టీకి చెందిన వేణుగోపాల్ ఈ స్థానం నుండి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహించారు. 1980 నుండి 1984 వరకు ఇందిరా కాంగ్రెస్ పార్టీ నుండి వి. రాజశేఖరన్ ప్రాతినిథ్యం వహించారు.

దినకరన్ విజయం

దినకరన్ విజయం

ఆర్ కె నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో స్వతంత్ర్య అభ్యర్థి దినకరన్ విజయం సాధించడం పట్ల సర్వత్రా ఆసక్తి కలుగుతోంది. ఈ ఫలితాలు తమిళనాడు రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేస్తోంది. మరో వైపు అన్నాడిఎంకె ఆధిపత్యం ఉన్న ఈ నియోజకవర్గంలో ఆ పార్టీ అభ్యర్థి మధుసూదన్ రెండో స్థానంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది. గతంలో మధుసూధన్ ఈ స్థానం నుండి ప్రాతినిథ్యం వహించారు.

English summary
AIADMK candidates won seven times from RK Nagar assembly segment in Tamilnadu state since 1977.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X