వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయ మేనకోడలకు దీపాకు మాజీ ఎమ్మెల్యేల మద్దతు: ఉతికేశారు

జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ రాజకీయ అరంగేట్రం జరిగిపోయిన తరువాత ఆమెకు బాసటగా నిలిచే వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా అన్నాడీఎంకే మాజీ శాసన సభ్యులు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: జయలలిత మేనకోడలు దీపా జయకుమార్ రాజకీయ అరంగేట్రం జరిగిపోయిన తరువాత ఆమెకు బాసటగా నిలిచే వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా అన్నాడీఎంకే మాజీ శాసన సభ్యులు, పార్టీ సీనియర్ నాయకులు మలరవన్, చంద్రశేఖర్ దీపాకు బహిరంగంగా మద్దతు తెలిపారు.

కోయంబత్తూరు మాజీ మేయర్, మాజీ ఎమ్మెల్యే అయిన మలరవన్ మీడియా సమావేశం పెట్టి మరీ శశికళ మీద దుమ్మెత్తి పోశారు. ఎంజీఆర్ అన్నాడీఎంకే పార్టీ స్థాపించిన రోజు నుంచి తాను ఆ పార్టీలో కొనసాగుతున్నానని చెప్పారు.

మేమే నీకు అండ: శశికళ ఎందుకు దండగ, దీపా పార్టీ డ్రస్ కోడ్ అదుర్స్

ఎంజీఆర్ మరణం తరువాత తాను జయలలిత నాయకత్వంలో పని చేశానని, అనేక పదవుల్లో ఉంటూ ప్రజా సేవ చేశానని తెలిపారు. అయితే జయలలిత మరణం తరువాత పార్టీలో పరిస్థితులు మారిపోయాయని మలరవన్ ఆవేదన వ్యక్తం చేశారు.

శశికళ భర్త నటరాజన్ తాను, తన కుటుంబ సభ్యులు అన్నాడీఎంకే పార్టీ ప్రగతి కోసం పాటుపడ్డానని చెప్పుకోవడం బాధాకరమని అన్నారు. అన్నాడీఎంకే పార్టీ అంటే ప్రాణం ఇచ్చే ఎవ్వరూ నటరాజన్ మాటలను సహించలేరని చెప్పారు.

జయ మేనకోడలు దీపా వర్గీయులపై శశికళ అండ్ కో దౌర్జన్యం: తాళం

జయలలిత కష్టపడి అన్నాడీఎంకే పార్టీని ఈ స్థాయికి తీసుకు వచ్చారని, అందులో శశికళ, ఆమె కుటుంబ సభ్యులు చేసింది ఏమీ లేదని గుర్తు చేశారు. అన్నాడీఎంకే పార్టీకి సరైన నాయకురాలు జయలలిత మేనకోడలు దీపా మాత్రమే అని ఆయన స్పష్టం చేశారు.

AIADMK ex MLA declare support for Deepa Jayakumar

తాను దీపాకు మద్దతు ఇస్తున్నానని, దీపా పేరవైలో తాను చేరుతున్నానని, తన అనుచరులను దీపా పేరవైలో చేరుస్తానని మాజీ ఎమ్మెల్యే మలరవన్ చెప్పారు. అన్నాడీఎంకే పార్టీకి రాజీనామా చేసిన మలరవన్ బాటలోనే పోల్లాచ్చి మాజీ ఎమ్మెల్యే వీపి. చంద్రశేఖర్ రాజీనామా చేసి దీపాకు మద్దతు తెలిపారు. ఇదే బాటలో ఇంకా చాల మంది నాయకులు ఉన్నారని అన్నాడీఎంకే నాయకులు అంటున్నారు.

రజనీకాంత్ రాజకీయాల్లోకి వస్తే అంతే: తుగ్లక్ !

తాంబరంలోని ముడిచ్చూరు రోడ్డులోని కల్యాణమండపంలో దీపా అభిమానులు ఎంజీఆర్ శతజయంతి వేడుకలు నిర్వహిస్తున్న సమయంలో శశికళ అనుచరులు వారి మీద దాడి చేశారు. దీపా అభిమానులను ఇష్టం వచ్చినట్లు చితకబాదేశారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరు వర్గాల వారికి నచ్చ చెప్పి అక్కడి నుంచి పంపించారు.

English summary
Former Coimbatore south MLA T Malaravan, who also had a stint as mayor of Coimbatore Corporation, and former Pollachi MLA V P Chandrasekar said they have decided to join the party to be floated by Deepa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X