వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చిన్నమ్మ‘శశికళ’కు చిక్కులు: అడ్డుకుంటాం,లేదంటే ?

నెచ్చెలి శశికళ అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి ఎలా అవుతారో చూస్తాం ? అంటూ ఆమె వ్యతిరేక వర్గీయులు అంటున్నారు. జయలలిత ఎలా పార్టీ పగ్గాలు చేతపట్టుకుంటారో చూస్తామని.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు వివంగత ముఖ్యమంత్రి జయలలిత స్థానంలో కుర్చోని రాజకీయ దర్బార్ ప్రదర్శించాలని ప్రయత్నిస్తున్న నెచ్చెలి శశికళకు రోజురోజుకు చిక్కులు ఎక్కువ అవుతున్నాయి. ఇప్పుడు వీటిని ఎలా పరిష్కరించాలి అని శశికళ వర్గీయులు అయోమయంలో పడిపోయారు.

అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి పదవిలో కుర్చోవాలని భావిస్తున్న చిన్నమ్మ శశికళ ఇప్పుడు చట్టపరమైన సమస్యలు ఎదుర్కొవాలని వ్యతిరేక వర్గం వారు సవాలు విసిరారు. డిసెంబర్ 29వ తేది జరగనున్నఅన్నాడీఎంకే పార్టీ కార్యవర్గ సమావేశానికి శశికళ మద్దతుదారులకు మాత్రమే ఆహ్వానాలు పంపిస్తున్నారు.

అజిత్ దెబ్బ: చేతులు ఎత్తేసిన హీరో, నేనురాను, శశికళకు షాక్

మమ్మల్ని కావాలనే దూరంపెడుతున్నారని, పిలువకపోయినా సరే సమావేశానికి వెళ్లి శశికళ ఎన్నికను అడ్డుకుంటాం, మేము విఫలం అయితే చట్టపరంగా తాము అనుకున్నది సాధిస్తామని శశికళ వ్యతిరేక వర్గం వారు అంటున్నారు.

AIADMK General Secrdtary sasikala ?

అన్నాడీఎంకేలో ప్రాథమిక సభ్యత్వం లేని శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎలా ఎన్నుకుంటారు అని ప్రశ్నిస్తున్నారు. పార్టీ నియమావలి ప్రకారం ఒక సభ్యుడిపై క్రమశిక్షణ చర్య తీసుకుంటే ఐదేళ్లపాటు అతను ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీల్లేదు.

ఎంత ధైర్యం: శశికళను కలుస్తారా, గవర్నర్ నోటీసులు

2011 డిసెంబర్ నెలలో శశికళను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. 2012 మార్చిలో తిరిగి శశికళ మళ్లీ జయలలిత దగ్గరకు చేరారు. అయితే శశికళకు మాత్రం పార్టీ సభ్యత్వ కార్డు ఇవ్వలేదని అన్నాడీఎంకే నాయకులే అంటున్నారు. ఇప్పుడు శశికళ అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి పోటీ చేసినా ఆ ఎన్నిక చెల్లదని అంటున్నారు.

చిన్నమ్మ వర్గీయులు కేవలం శశికళ మాత్రమే నామినేషన్ వేసేలా ఆమె అనుచరులు వ్యవహరిస్తున్నారని, తాము ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తామని అన్నాడీఎంకే పార్టీలోని వ్యతిరేక వర్గం నాయకులు హెచ్చరించారు. మొత్తం మీద శశికళ మీద చట్టపరంగా కసి తీర్చుకోవడానికి ఆమె వ్యతిరేకులు సిద్దం అవుతున్నారు.

English summary
The ruling AIADMK is convening a crucial general council meeting on December 29 to elect their new general Secrdtary.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X