వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జైలు నుంచి ఎన్నికల కమిషన్ కు లేఖ రాసిన శశికళ: ఎందుకంటే !

అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా తనను ఎలా ఎంపిక చేశారు అంటూ మా వాళ్లు (తమిళనాడు ప్రభుత్వ పెద్దలు) మీకు పూర్తి సమాచారం ఇస్తారని, మంగళవారం మిమ్మల్ని కలవడానికి అపాయింట్ మెంట్ ఇవ్వాలని బెంగళూరు

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: భారత ఎన్నికల కమిషన్ కు అన్నాడీఎంకే పార్టీ తాత్కాలిక ప్రధాన కార్యదర్శి శశికళ లేఖ రాశారు. మా వాళ్లు ( తమిళనాడు ప్రభుత్వ పెద్దలు) మంగళవారం మిమ్మల్ని కలవడానికి అపాయింట్ మెంట్ ఇవ్వండి, వాళ్లు మీకు పూర్తి సమాచారం ఇస్తారని చిన్నమ్మ శశికళ భారత ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు.

అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ ఎంపికను రద్దు చెయ్యాలని ఆపార్టీ ప్రిసీడియం చైర్మన్ (శశికళ బహిష్కరించారు) మధుసూదనన్ ఎన్నికల కమిషన్ కు లేఖ రాసిన విషయం తెలిసిందే. అన్నాడీఎంకే పార్టీలో శశికళ సభ్యత్వం తీసుకుని ఐదేళ్లు పూర్తి కాలేదని మధుసూదనన్ ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు.

అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి చేపట్టాలంటే శశికళకు ఐదేళ్ల సభ్యత్వం పూర్తి కావాలని, అందు వలన ఆమె ఎన్నికను రద్దు చెయ్యాలని మధుసూదనన్ ఆపార్టీ ప్రిసీడియం చైర్మన్ గా ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు.

AIADMK genral secratary Sasikala has to file reply for the election commission notice

అంతకు ముందే అన్నాడీఎంకే నుంచి బహిష్కరణకు గురైన రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప సైతం శశికళ నటరాజన్ ఎన్నికను రద్దు చెయ్యాలని ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలొ మీరు అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎలా ఎన్నిక అయ్యారు ? అంటూ ఎన్నికళ కమిషన్ శశికళ నటరాజన్ కు నోటీసులు జారీ చేశారు.

బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార జైలుకు శశికళ వెళ్లిన తరువాత ఎన్నికల కమిషన్ కు ఇచ్చిన నోటీసులు అందాయి. ఈ పేపథ్యంలో శశికళ నటరాజన్ ఎన్నికల కమిషన్ కు సమాధానం ఇస్తూ లేఖ పంపించారు.

మంగళవారం అన్నాడీఎంకే ప్రభుత్వ పెద్దలు, పార్టీ నాయకులు మిమ్మల్ని కలిసి తనను ఎలా పార్టీ ప్ఱధాన కార్యదర్శిగా ఎన్నుకున్నారు అని పూర్తి వివరణ ఇస్తారని, మీరు అపాయింట్ మెంట్ ఇవ్వాలని శశికళ జైలు నుంచి ఎన్నికల కమిషన్ కు లేఖ పంపించారు.

English summary
AIADMK genral secratary Sasikala has to file reply for the election commission notice about her appointment in the party by tomorrow.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X