వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నాడీఎంకే 365 డేస్: సీఎంకు రెండు వర్గాలు వార్నింగ్, రాజీనామా చెయ్యాలి, పార్టీలో !

తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీ అధికారంలోకి వచ్చి నేటితో ఒక్క సంవత్సరం పూర్తి అయ్యింది. అయితే అదే రోజు రెండు వర్గాల నాయకులు తమ వర్గంలోని ఎమ్మెల్యేలను వెంట పిలుచుకుని ఏకంగా సచివాలయం చేరుకుని మాడి మాండ్లు

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులో వరుసగా రెండో సారి అధికారం చేపట్టిన అన్నాడీఎంకే పార్టీ నేటితో (మే 23)తో ఒక్క సంవత్సరం అధికారం పూర్తి చేసుకుంది. ఒక్క సంవత్సరం అధికారం పూర్తి చేసుకున్న సందర్బంగా అన్నాడీఎంకే కార్యకర్తలు ఎక్కడా సంబరాలు చేసుకోలేదు.

<strong>సీఎం పళనిసామి ఢిల్లీకి పరుగు: పన్నీర్ దెబ్బ, ప్రధాని మోడీ చేతిలో రిమోట్ కంట్రోల్ !</strong>సీఎం పళనిసామి ఢిల్లీకి పరుగు: పన్నీర్ దెబ్బ, ప్రధాని మోడీ చేతిలో రిమోట్ కంట్రోల్ !

కనీసం మిఠాయిలు పంచిపెట్టలేదు. జయలలిత మరణం, తరువాత పన్నీర్ సెల్వం ముఖ్యమంత్రి కావడం, శశికళ ఆదేశాలతో ఆయన రాజీనామా చెయ్యడం, చిన్నమ్మ, టీటీవీ దినకరన్ జైలుకు వెళ్లడం, ఎడప్పాడి పళనిసామి ముఖ్యమంత్రి కావడం ఇదే సంవత్సంలో జరిగిపోయాయి.

సీఎంకు సినిమా చూపించారు

సీఎంకు సినిమా చూపించారు

అన్నాడీఎంకే అధికారంలోకి వచ్చి ఒక్క సంవత్సరం పూర్తి అయిన సందర్బంలో ఆ పార్టీకి చెందిన 15 మంది సీనియర్ ఎమ్మెల్యేలు సచివాలయం చేరుకుని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామికి సినిమా చూపించారు. ప్రభుత్వం, పార్టీలో మార్పులు చెయ్యాలని మంగళవారం డిమాండ్ చేశారు. మీరు మా డిమాండ్లు తీర్చకపోతే మద్దతు ఉపసంహరించుకుంటామని హెచ్చరించారని సమాచారం.

మంత్రి వర్గంలో అవకాశం ఇవ్వాలి !

మంత్రి వర్గంలో అవకాశం ఇవ్వాలి !

మాజీ మంత్రులు తోపు వెంకటాచలం, సెంథిల్ బాలాజీ, పి పళనియప్పన్ తో సహ వారి వర్గంలోని పలువురు ఎమ్మెల్యేలు మరో గ్రూపుగా సీఎం పళనిసామిని కలిశారు. మేం ముగ్గురు జయలలిత మంత్రి వర్గంలో పని చేశామని, ఇప్పుడు మళ్లీ మాకు మంత్రి పదవులు కావాలని, లేదంటే వేరే దారి చూసుకుంటామని పళనిసామికి పరోక్షంగా హెచ్చరించారని వెలుగు చూసింది.

రెండు గ్రూపులు వార్నింగ్ ఇస్తే !

రెండు గ్రూపులు వార్నింగ్ ఇస్తే !

రెండు వర్గాలుగా వచ్చి వారి డిమాండ్లు చెప్పడంతో ఎడప్పాడి పళనిసామి హడలిపోయారని తెలిసింది. అందరూ ఏకం అయ్యి తన సీఎం పదవికి ఎసరు పెడుతున్నారని గ్రహించిన పళనిసామి కొద్ది రోజులు వేచి ఉండాలని బుజ్జగించడానికి ప్రయత్నాలు చేసినా ఫలితం లేకపోయిందని సమాచారం.

సన్నిహితులతో సీఎం సమావేశం !

సన్నిహితులతో సీఎం సమావేశం !

రెండు వర్గాలు వచ్చి వారి డిమాండ్లు చెప్పి వెళ్లిన వెంటనే పళనిసామి తనకు అందుబాటులో ఉన్న మంత్రులను పిలిపించుకుని చర్చించారని తెలిసింది. ప్రభుత్వానికి మద్దతు ఇవ్వాలంటే వారి డిమాండ్లు తీర్చాలని అంటున్నారని ఇప్పుడు ఏమి చెద్దాం అంటూ పళనిసామి వారి నుంచి సూచనలు, సలహాలు తీసుకున్నారని తెలిసింది.

త్యాగం చెయ్యండి

త్యాగం చెయ్యండి

గ్రూపులుగా విడిపోయిన నాయకులకు మంత్రి వర్గంలో చోటు కల్పించాలంటే ప్రస్తుతం మంత్రి వర్గంలో ఉన్న వారు రాజీనామా చెయ్యాలని పళనిసామి సహచర మంత్రులతో చెప్పారని తెలిసింది. కొత్త వారికి అవకాశం కల్పించాలంలే మీలో ఎవరు త్యాగం చేస్తారు ? అని ఆరా తీశారని సమాచారం.

పేరుకు మాత్రం సీఎం, ముఖంలో !

పేరుకు మాత్రం సీఎం, ముఖంలో !

పేరుకు మాత్రం తమిళనాడు ముఖ్యమంత్రిగా ఉన్న ఎడప్పాడి పళనిసామి ముఖంలో కనీసం నవ్వు కూడా కనిపించలేదు. మంత్రులతో సహ అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు సైతం ఎక్కడా సంబరాలు చేసుకోలేదు. మన పార్టీ అధికారంలోకి వచ్చి ఒక్క సంవత్సరం అయ్యిందా అంటూ ఆ పార్టీ కార్యకర్తలు ఆశ్చర్యంగా మాట్లాడటం వింటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతోంది.

జయలలితను మరిచిపోయారు ?

జయలలితను మరిచిపోయారు ?

తమిళనాడులో అన్నాడీఎంకే పార్టీ అధికారంలోకి రావడానికి ప్రధాన కారణం అయిన జయలలిత మరణించారు. అధికారంలోకి వచ్చి ఒక్క సంవత్సరం పూర్తి అయిన సందర్బంగా కనీసం ఎక్కడకాని అమ్మ చిత్రపఠానికి నివాళులు అర్పించలేదు. ఎడప్పాడి పళనిసామికి ఆయన అత్యంత సన్నిహితులు మాత్రం శుభాకాంక్షలు చెప్పారని తెలిసింది.

English summary
Incidentally, Chief Minister Edappadi K. Palaniswami, who enjoys a wafer-thin majority in the Assembly, would be completing 100 days in office later this week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X