వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్యేలు జంప్: మైసూరు రిసార్ట్ కు రెబల్ ఎమ్మెల్యేలు, సీఎం పళని, పన్నీర్ దెబ్బతో !

తమిళనాడులోని ఎడప్పాడి పళనిసామి మీద తిరుగుబాటు చేసిన అన్నాడీఎంకే పార్టీ రెబల్ ఎమ్మెల్యేలను పుదుచ్చేరి నుంచి కర్ణాటకలోని మైసూరుకు తరలించాలని టీటీవీ దినకరన్ నిర్ణయించారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై/బెంగళూరు: తమిళనాడులోని ఎడప్పాడి పళనిసామి మీద తిరుగుబాటు చేసిన అన్నాడీఎంకే పార్టీ రెబల్ ఎమ్మెల్యేలను పుదుచ్చేరి నుంచి కర్ణాటకలోని మైసూరుకు తరలించాలని టీటీవీ దినకరన్ నిర్ణయించారు. ఎమ్మెల్యేలు గోడదూకడంతో మన్నార్ గుడి మాఫియా హడలిపోయింది.

నడి రోడ్డులో ఏసీపీ కామపిచ్చి: మహిళా ఎస్ఐ మీద చెయ్యి ఎక్కడ వేశాడంటే (వీడియో)నడి రోడ్డులో ఏసీపీ కామపిచ్చి: మహిళా ఎస్ఐ మీద చెయ్యి ఎక్కడ వేశాడంటే (వీడియో)

గురువారం దినకరన్ క్యాంప్ లో ఉన్న ఎమ్మెల్యే ఎస్ టీకే. జక్కయ్యన్ పుదుచ్చేరి రిసార్ట్ నుంచి గోడదూకి నేరుగా చెన్నై చేరుకున్నారు. తరువాత తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం ను కలిసి మద్దతు ప్రకటించారు.

 AIADMK legislators supporting TTV Dinakaran shift base to Mysuru

అనంతరం నేరుగా తమిళనాడు స్పీకర్ ధనపాల్ ను కలిసి ఎడప్పాడి పళనిసామికి వ్యతిరేకంగా మద్దతు ఉపంసహరించుకున్నట్లు గత నెలలో ఇచ్చిన లేఖను వెనక్కి తీసుకున్నారు. తన మద్దతు ఎడప్పాడి పళనిసామికే ఉంటుందని స్పీకర్ ధనపాల్ కు లేఖ ఇచ్చారు.

షాక్: మోడీ చేతిలో అస్త్రం: సీఎం పళని, పన్నీర్ స్కెచ్: దినకరన్ భారత్ పౌరసత్వం రద్దు !షాక్: మోడీ చేతిలో అస్త్రం: సీఎం పళని, పన్నీర్ స్కెచ్: దినకరన్ భారత్ పౌరసత్వం రద్దు !

ఎమ్మెల్యే జక్కయ్యన్ జంప్ కావడంతో మిగిలిన ఎమ్మెల్యేలు గోడదూకకుండా చూసుకోవాలని టీటీవీ దినకరన్ తన మద్దతుదారుడు, రెబల్ ఎమ్మెల్యేల నాయకుడు తంగ తమిళ సెల్వన్ కు సూచించారు. పుదుచ్చేరిలోని ఎమ్మెల్యేలను కర్ణాటక తరలించాలని నిర్ణయించారు.

తమిళనాడులోని కాంచీపురం, వేలూరు మీదుగా మైసూరుకు శుక్రవారం దినకరన్ క్యాంప్ లోని అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు బయలుదేరడానికి సిద్దం అయ్యారు. దినకరన్ క్యాంప్ లోని ఎమ్మెల్యేలకు ఎలగైనా గాలం వెయ్యాలని పళనిసామి, పన్నీర్ సెల్వం ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

English summary
It seems Puducherry is no longer a safe destination for MLAs supporting sidelined AIADMK deputy general secretary TTV Dhinakaran. The remaining MLAs reportedly vacated the resort and went to Mysuru.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X