చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

జాక్ పాట్: డిసెంబర్ 29 నెచ్చలి శశికళ డే ? ఎందుకంటే !

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నెచ్చెలి శశికళకు ఇదే నెలలో అన్నాడీఎంకే పగ్గాలు అప్పగించడానికి ఆ పార్టీ నాయకులు సిద్దం అవుతున్నారు. ఏమైనా సరే చిన్నమ్మకు పార్టీ పగ్గాలు అప్పగించి తరువాత సీఎం సీటు గురించి మాట్లాడుదాం అంటున్నారు.

డిసెంబర్ 29వ తేదీన అందుకు ముహూర్తం పెట్టారు. డిసెంబర్ 29వ తేదీ అన్నాడీఎంకే పార్టీ కార్యవర్గ సమావేశం నిర్వహిస్తున్నామని, మంత్రులతో పాటు జిల్లా అధ్యక్షులు, పార్టీ నాయకులు ఈ సమావేశానికి హాజరుకావాలని శుక్రవారం నాయకులు ఆదేశాలు జారీ చేశారు.

మోడీ మైండ్ గేమ్: బీజేపీ చేతిలో పన్నీర్ జుట్టు, గిరిజ ఎవరో తెలుసా ?మోడీ మైండ్ గేమ్: బీజేపీ చేతిలో పన్నీర్ జుట్టు, గిరిజ ఎవరో తెలుసా ?

శుక్రవారం పోయెస్ గార్డెన్ లో శశికళను కలిసిన తరువాత పార్టీ నాయకులు ఈ ఆదేశాలు జారీ చేశారు. మొదటి సారి అన్నాడీఎంకే పార్టీ కార్యాలయంలో కాకుండా వేరే ప్రాంతంలో ఈ సమావేశం నిర్వహిస్తున్నారు.

 AiADMK meet: Will December 29 Sasikala Natarajan’s day?

చెన్నై నగర శివార్లలోని వనగరం ప్రాంతంలోని శ్రీవారు కల్యాణ మండపం (కెప్టన్ విజయ్ కాంత్ టీవీ కార్యాయలం సమీపంలో) అన్నాడీఎంకే కార్యవర్గ సమావేశానికి వేదిక అయ్యింది. ఈ సమావేశంలో అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కారద్యర్శిని నియమిస్తామని ఆ పార్టీ అధికార ప్రతినిథి పొన్నయన్ అంటున్నారు.

అయితే శశికళ నటరాజన్ కు అన్నాడీఎంకేలో ఐదు సంవత్సరాల పార్టీ సభ్యత్వం లేదని, ఆమె ఆపదవికి పోటీ చెయ్యడానికి అనర్హురాలని రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప (అన్నాడీఎంకే పార్టీ బహిష్కరించింది) మద్రాసు హై కోర్టును ఆశ్రయించారు.

షాక్: పన్నీర్, శశికళ వర్గీయులు ఎత్తులు పై ఎత్తులు ? ఫలితంగా ఐటీ దాడులు !షాక్: పన్నీర్, శశికళ వర్గీయులు ఎత్తులు పై ఎత్తులు ? ఫలితంగా ఐటీ దాడులు !

ప్రస్తుతం ఈ విషయంపై కోర్టులో విచారణ పెండింగ్ లో ఉంది. ఇదే సమయంలో అన్నాడీఎంకే నాయకులు పార్టీ కార్యవర్గ సమావేశానికి పిలుపునివ్వడంతో ఆ పార్టీ కార్యకర్తలు ఏమి జరుగుతుందో అంటూ గుసగుసలాడుతున్నారు.

డిసెంబర్ 29వ తేదీలోపు మద్రాసు హై కోర్టు ఈ విషయంపై ఏదైనా నిర్ణయం తీసుకుంటే పార్టీ నాయకత్వ భాద్యతలు శశికళ నటరాజన్ కు అప్పగించడానికి అడ్డంకులు ఏర్పడుతాయని, లేదా ఆమెకు అన్నీ అనుకూలించే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

English summary
AIADMK is stepping into a new phase and new leadership. This meeting is expected to make Sasikala the new face of the party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X