వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శశికళ మైండ్ గేమ్, పన్నీర్ సెల్వంకు చెక్ పెట్టేందుకే, వేటు పడింది

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే పార్టీ నియమాలకు వ్యతిరేకంగా మాట్లాడుతూ తననే ధిక్కరించి అపద్దర్మ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంకు మద్దతు తెలుపుతున్న పార్టీ సీనియర్లపై వేటు వెయ్యాలని శశికళ నటరాజన్ భావిస్తున్నారు. మనల్ని ధిక్కరించిన వారిపై వెంటనే వేటు వెయ్యాలని ఆమె వర్గీయులు ఒత్తిడి తెస్తున్నారు.

అయితే రెండు మూడు రోజులు వేచి చూసి ఇంకా ఎవరెవరు పన్నీర్ సెల్వంకు మద్దతు ఇస్తారో అని స్పష్టత వచ్చిన తరువాత అందరి మీద ఒకే సారి చర్యలు తీసుకుని వేటు వెయ్యాలని శశికళ భావిస్తున్నారని ఆమె సన్నిహితులు అంటున్నారు.

<strong>శశికళకు చివరి చాన్స్: పన్నీర్ కు చెక్ పెట్టాలంటే ఇది ఒక్కటే మార్గం!</strong>శశికళకు చివరి చాన్స్: పన్నీర్ కు చెక్ పెట్టాలంటే ఇది ఒక్కటే మార్గం!

పుదుచ్చేరి వెల్లికుప్పం మాజీ ఎమ్మెల్యే ఓంశక్తి శేఖర్ ను పార్టీ నుంచి బహిష్కరించామని, పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి తొలగించామని శశికళ ఆదేశాలు జారీ చేశారు. పార్టీ కార్యకర్తలు ఎవ్వరూ నేటి నుంచి ఓంశక్తి శేఖర్ తో సంబంధాలు పెట్టుకోరాదని శశికళ ఆదేశాలు జారీ చేశారు.

AIADMK MLA extends hi support to Tamil Nadu CM Panneerselvam

మరో వైపు అన్నాడీఎంకే ప్రిసీడియం చెర్మన్ మధుసూదనన్, పార్టీ సీనియర్ నేత విశ్వనాథనన్ తదితరులు కూడా పన్నీర్ సెల్వంకు బహిరంగంగా మద్దతు పలకడంతో పాటు శశికళ మీద తీవ్రస్థాయిలో ఆరోపణలు చేసినా వారి మీద ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు..

<strong>రాజీకి వచ్చిన శశికళ: పన్నీర్ సెల్వం ఇంటికి పరుగు తీసి వెళ్లి!</strong>రాజీకి వచ్చిన శశికళ: పన్నీర్ సెల్వం ఇంటికి పరుగు తీసి వెళ్లి!

పన్నీర్ సెల్వంతో చేతులు కలిపి సంపూర్ణ మద్దతు ప్రకటించిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు అలెగ్జాండర్, మనోరంజితం, మాణిక్యం, ఆర్. కుట్టి, షణ్మగనాథన్, రాజ్యసభ సభ్యుడు మైత్రేయన్ తదితరు మీద ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

వారందరినీ పార్టీలోకి తీసుకుని పన్నీర్ సెల్వంను ఏకాకి చెయ్యాలని శశికళ వర్గీయులు విఫలయత్నం చేస్తున్నారు. అయితే శశికళ వర్గంలో ఉన్న వారే బయటకు వచ్చి పన్నీర్ సెల్వంకు మద్దతు ఇచ్చే అవకాశం ఉందని, శశికళ అంత ధైర్యంగా వారి మీద వేటు వెయ్యలేరని రాజకీయ నిపుణులు అంటున్నారు.

English summary
At the end of round two, caretaker Chief Minister O Panneerselvam seems to have emerged temporarily as the victorious victim, David.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X