వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సీఎం పళనిసామి అత్యవసర సమావేశం, శశికళను శాశ్వతంగా సాగనంపాలని రహస్య చర్చ !

తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు, ఎంపీలతో రహస్యంగా చర్చిస్తున్నారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి అన్నాడీఎంకే ఎమ్మెల్యేలు, ఎంపీలతో రహస్యంగా చర్చిస్తున్నారు. అన్నాడీఎంకే పార్టీ రాష్ట్ర, జిల్లా నాయకులను సమావేశానికి దూరం పెట్టి కేవలం ఎమ్మెల్యేలు, ఎంపీలతో మాత్రమే చర్చలు జరుపుతున్నారు.

60 మంది ఎమ్మెల్యేలు, 8 మంది మంత్రులు మాకే మద్దతు: బాంబు పేల్చిన మన్నార్ గుడి !60 మంది ఎమ్మెల్యేలు, 8 మంది మంత్రులు మాకే మద్దతు: బాంబు పేల్చిన మన్నార్ గుడి !

చెన్నైలోని రాయపేట్ లోని అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యాలయంలో సోమవారం ఉదయం సీఎం పళనిసామి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. రోజురోజుకు దినకరన్ దూకుడు పెంచుతున్న సమయంలో సీఎం పళనిసామి వ్యూహాత్మకంగా పావులుకదుపుతున్నారు.

AIADMK MLAs,MPs and functionaries meeting at AIADMK head office

పార్టీ కార్యవర్గం, సర్వసభ్య సమావేశం ఎప్పుడు నిర్వహించాలి ? అనే విషయంపై చర్చజరుగుతోంది. సెప్టెంబర్ మొదటి వారంలో పార్టీ సర్వసభ్య సమావేశం నిర్వహించాలని చర్చిస్తున్నారని తెలిసింది. శశికళను, టీటీవీ దినకరన్ ను శాశ్వతంగా పార్టీ నుంచి సాగనంపడానికి సీఎం పళనిసామి, పన్నీర్ సెల్వం పావులుకదుపుతున్నారు.

ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు: వివరణ ఇవ్వం, ఏం చేస్తారు, టీటీవీ దినకరన్ గ్రూప్ !ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు: వివరణ ఇవ్వం, ఏం చేస్తారు, టీటీవీ దినకరన్ గ్రూప్ !

మరో వైపు తానేమి తక్కువ తిన్నానా అంటూ టీటీవీ దినకరన్ ఎత్తులకు పైఎత్తులు వేస్తున్నారు. అన్నాడీఎంకే పార్టీ కార్యవర్గంలోని 255 మంది, సర్వసభ్యుల్లోని 2,750 మంది సభ్యుల మద్దతుకూడగట్టుకునే పనిలో దినకరన్ బిజిబిజీగా గడుపుతున్నారు. పళనిసామి నేతృత్వంలో జరుగుతున్న సమావేశంలో తమిళనాడు మంత్రులు హాజరైనారు.

English summary
AIADMK MLAs,MPs and functionaries meeting today at Rayapettai AIADMK head office in Chennai head of Tamil Nadu Chief Minister Edapadi Palanisamy, today decides date of AIADMK general body meeting.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X