వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్నాడీఎంకే పార్టీ అధికారిక టీవీ చానల్ పేరు ఇదే: జయా టీవీకి పోటీ, పళని, పన్నీర్!

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులో అధికారంలో ఉన్న అన్నాడీఎంకే పార్టీ కోసం టీవీ చానల్ ప్రారంభించడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. అన్నాడీఎంకే పార్టీ ప్రచారం కోసం జయా టీవీకి పోటీగా అధికారికంగా టీవీ చానల్ ప్రారంభించాలని పళనిస్వామి, పన్నీర్ సెల్వం నిర్ణయించారు.

జయలలిత చికిత్స సీసీటీవీ క్లిప్పింగ్స్ ఇవ్వండి, అపోలోకు విచారణ కమిషన్ ఆదేశాలు!జయలలిత చికిత్స సీసీటీవీ క్లిప్పింగ్స్ ఇవ్వండి, అపోలోకు విచారణ కమిషన్ ఆదేశాలు!

అన్నాడీఎంకే పార్టీ అధికారిక టీవీ చానల్ పేరు న్యూస్- జే. న్యూస్- జే టీవీ చానల్ ను తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం నిర్వహణలో ప్రజల ముందుకు రావడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకుంది.

ముహూర్తం ఫిక్స్

ముహూర్తం ఫిక్స్

ఈనెల 12వ తేదీ నుంచి న్యూస్ జే టీవీ టెస్టింగ్ ప్రసారాలు ప్రారంభిస్తారు. ఈనెల చివరివారం వరకు సాంకేతిక లోపాలు పరిశీలించి తరువాత పూర్తిస్థాయి ప్రసారాలు చెయ్యాలన్ని అన్నాడీఎంకే పార్టీ నిర్ణయించింది. అన్నాడీఎంకే పార్టీ, ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు చేరువయ్యేలా చర్యలు తీసుకుంటున్నారు.

శశికళ ఫ్యామిలీ

శశికళ ఫ్యామిలీ

అన్నాడీఎంకే పార్టీకి గతంలో జయా టీవీ ఉండేది. గతంలో జయా టీవీ భాద్యతలను జయలలిత స్వయంగా చూసుకునే వారు. జయలలిత మరణించిన తరువాత జయా టీవీ వీకే శశికళ కుటుంబ సభ్యుల చేతిలోకి వెళ్లిపోయింది.

ప్రభుత్వానికి వ్యతిరేకం

ప్రభుత్వానికి వ్యతిరేకం

శశికళ జైలుకు వెళ్లిన తరువాత ఆమె అన్న కుమారుడు వివేక్ జయా టీవీ సీఇవోగా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. జయా టీవీలో తమిళనాడులోని అన్నాడీఎంకే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు ప్రసారం కావడం మొదలైనాయి.

పన్నీర్ సెల్వం ప్లాన్

పన్నీర్ సెల్వం ప్లాన్

గత ఏడాది పన్నీర్ సెల్వం ఒక తమిళ టీవీ చానల్ ను కొనుగోలు చేశారు. తమకు అనుకూలంగా వార్తలు ప్రసారం చెయ్యడానికి టీవీ చానల్ అవసరం అని ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం భావించారు. అన్నాడీఎంకే పార్టీని మరింత బలపరచడానికి న్యూస్- జే చానల్ లో వార్తలు ప్రసారం చెయ్యాలని నిర్ణయించారు.

జయా టీవీతో న్యూస్ జే పోటీ

జయా టీవీతో న్యూస్ జే పోటీ

జయలలిత పేరులోని మొదటి అక్షరం (ఇంగ్లీష్) న్యూస్ చానల్ కు పెట్టారు. జయా టీవీకి పోటీగా న్యూస్ జే చానల్ నిర్వహించాలని అన్నాడీఎంకే నాయకులు నిర్ణయించారు. వీలైనంత త్వరగా న్యూస్ జే చానల్ ప్రజలను అకట్టుకునే విధంగా కార్యక్రమాలు ప్రసారం చెయ్యాలని ఎడప్పాడి పళనిస్వామి, పన్నీర్ సెల్వం పక్కా ప్లాన్ వేశారు.

English summary
Tamil Nadu: AIADMK party Official to launch its own TV Channel News-J.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X