చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అన్నాడిఎంకె సమావేశంలో చేసిన తీర్మాణాలు ఇవే

అన్నాడిఎంకె కీలక సమావేశంలో ఇవాళ కీలకమైన ప్రధాన కార్యదర్శి పదవితో పాటు మరో 12 తీర్మాణాలను ఆమోదించారు. అయితే ప్రధానంగా శశికళకు పగ్గాలు అప్పగించేందుకే ఈ సమావేశాన్ని ఏర్పాటుచేశారు.

By Narsimha
|
Google Oneindia TeluguNews

చెన్నై:అన్నాడిఎంకు పార్టీ సమావేశంలో కీలకమైన పార్టీ ప్రధాన కార్యదర్శి పదవిని శశికళకు అప్పగిస్తూ చేసిన తీర్మాణంతో పాటు మరో పదమూడు తీర్మాణాలు చేశారు.ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యం కేవలం శశికళకు పట్టం కట్టబెట్టేందుకు ఉద్దేశించిందేనని పార్టీ నాయకులు చెబుతున్నారు.

అన్నా డిఎంకె పార్టీ సర్వసభ్య సమావేశం గురువారం నాడు చెన్నైలో జరిగింది ఈ సమావేశంలో శశికళను పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నుకొన్నారు. జయలలితకు శశికళ సన్నిహితురాలుగా ఉన్నారు. జయలలిత తర్వాత ఆమె సన్నిహితురాలే పార్టీ పగ్గాలను చేపట్టారు.

ఈ సమావేశంలో పార్టీ 14 తీర్మాణాలను ఆమోదించారు. శశికళ నటరాజన్ నాయకత్వంలో పనిచేయాలని ఏకగ్రీవ తీర్మాణాన్ని సమావేశంలో ఆమోదించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి పదవికి ఎన్నికల నిర్వహణ చేపట్టేలా నిబంధనలను సవరించాలని తీర్మాణం కూడ ఈ సమావేశం ఆమోదం తెలిపింది.

aiadmk passed 14 resolutions

జయలలితకు భారతరత్న ఇవ్వాలని కూడ కోరుతూ సమావేశం డిమాండ్ చేసింది. పార్లమెంట్ లో జయలలిత కాంస్య విగ్రహన్ని ఏర్పాటు చేయాలని సమావేశం కేంద్రాన్ని కోరుతూ తీర్మాణం చేసింది.

జయలలిత పుట్టిన రోజును జాతీయ రైతు దినోత్సవంగా ప్రకటించాలని సమావేశం తీర్మాణం చేసింది. జయలలితకు నోబెల్ శాంతి పురస్కారం దక్కేలా ప్రయత్నం చేయాలని సమావేశం కోరింది.

ఈ సమావేశానికి శశికళ హజరుకాలేదు. సమావేశం ముగిసిన తర్వాత పన్నీరు సెల్వం పోయెస్ గార్డెన్ కు వెళ్ళి శశికళను కలిశారు. పార్టీ సమావేశంలో ఆమోదించిన తీర్మాణం కాపీని ఆమెకు అందజేశారు. సభ్యుల కోరిక మేరకు పార్టీ పగ్గాలు చేపట్టేందుకు అంగీకరించిన ఆమె కాపీపై తొలి సంతకం పెట్టారు.

English summary
aiadmk passed 14 resolutions in the presence of cm panneer selvam and the top leaders that allows shashikala to lead party .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X