వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

శశికళ గురి తప్పింది: పన్నీర్ గూటిలో 11 మంది ఎంపీలు, కథ క్లైమాక్స్ కే !

అన్నాడీఎంకే లోక్ సభ సభ్యులు త్యాగరాజన్, సెంగుట్టవన్, మారుతీ రాజా, రాజేంద్రన్, పార్థీబన్. రాజ్యసభ సభ్యుడు లక్ష్మణన్ పన్నీర్ సెల్వం గూటికి చేరిపోవడంతో ఇప్పుడు 11 ఎంపీలు మంది ఆయనకు మద్దతు ఇస్తున్నారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: జయలలిత సమాధి సాక్షిగా పన్నీర్ సెల్వం తిరుగుబాటు జెండా ఎగురవేసి ఆరు రోజులు అయ్యింది. ఎమ్మెల్యేల మద్దతు కూడగట్టుకోవడానికి పన్నీర్ సెల్వం వర్గీయులు అన్ని రకాలుగా ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఇప్పటికే పన్నీర్ సెల్వం అనేక వ్యూహాలు అమలు చేస్తున్నారు.

పోయెస్ గార్డెన్ నుంచి శశికళ ఔట్: జీవోపై సంతకం చేసేసిన పన్నీర్పోయెస్ గార్డెన్ నుంచి శశికళ ఔట్: జీవోపై సంతకం చేసేసిన పన్నీర్

తమిళనాడు ప్రజలు, అన్ని పార్టీల నాయకులు, సినీప్రముఖుల మద్దతు సాధించడంలో పన్నీర్ సెల్వం విజయం సాధించారు. అయితే అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను కూడగట్టడంలో పన్నీర్ సెల్వం అనుకున్న దానికంటే వెకంజలోనే ఉన్నారని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

AIADMK rebel MP count grows 11: Tamil Nadu CM Panneerselvam wait for MLAs

అయితే అనుకోని రీతిలో పన్నీర్ సెల్వం ఎంపీలను తనగూటికి రప్పించుకుని చిన్నమ్మ శశికళకు గట్టి దెబ్బ కొట్టారు. ఆదివారం రాత్రి వరకు పన్నీర్ సెల్వం గూటికి 11 మంది ఎంపీలు చేరిపోయి శశికళకు ఝలక్ ఇచ్చారు. ఈ సంఖ్య రెండింతలు అయ్యే అవకాశం ఉందని పన్నీర్ సెల్వం వర్గంలోని ఎంపీలు అంటున్నారు.

దెబ్బకు దెబ్బ: పన్నీర్ సెల్వం గూటికి లోక్ సభ ఎంపీలు: శశికళ పని!దెబ్బకు దెబ్బ: పన్నీర్ సెల్వం గూటికి లోక్ సభ ఎంపీలు: శశికళ పని!

తూత్తుకుడి ఎంపీ జయసింగ్ త్యాగరాజన్, వేలూరు ఎంపీ సెంగుట్టవన్, పెరంబలూరు ఎంపీ మారుతీ రాజా, విల్లుపురం ఎంపీ రాజేంద్రన్, తేని ఎంపీ పార్టీబన్, రాజ్యసభ సభ్యుడు లక్ష్మణన్ లో పన్నీర్ సెల్వం గూటికి చేరారు. ఇప్పటికే ఐదు మంది ఎంపీలు పన్నీర్ సెల్వం గూటికి చేరిపోయారు. ఈ ఆరు మంది చేరికతో పన్నీర్ సెల్వం గూటిలో 11 మంది అన్నాడీఎంకే ఎంపీలు (రెబల్) ఉన్నారు.

English summary
The total number of MPs supporting Tamil Nadu CM Panneerselvam to 11 (9 Lok Sabha members and 2 Rajya Sabha members).
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X