వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మన్నార్ గుడి మాఫియా: శశికళ అండ్ కో కేసుల చిట్టా, సీఎంగా నో చాన్స్?

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి పదవిపై కన్నేసిన చిన్నమ్మ శశికళ అండ్ ఫ్యామిలీ మీద ఉన్న కేసుల జాబితాను రాష్ట్రపతి, కేంద్ర ప్రభుత్వానికి, గవర్నర్ కు పంపించడానికి పన్నీర్ సెల్వం వర్గీయులు రంగం సిద్దం చేస్తున్నారు. శశికళ సీఎం కాకుండా అడ్దుకోవడానికి ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

జయలలిత ప్రాణస్నేహితురాలు అనే ఒక్క విషయం మాత్రమే శశికళకు ఫ్లస్ పాయింట్. మిగిలిన అన్ని అంశాలు శికళకు వ్వతిరేకంగానే ఉన్నాయి. అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా, తమిళనాడు శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన శశికళ సీఎం కావడం అంత సులభం కాదు.

ఎంత మాత్రం రాజకీయ అనుభవం లేకపోవడం, ఉప ఎన్నికల్లో గెలవడం, అనేక కేసుల్లో శశికళ ఆమె కుటుంబ సభ్యులు విచారణ ఎదురక్కొంటున్న సమయంలో ఆమె సీఎం కావడానికి అనేక అడ్దంకుటు ఎదురౌతున్నాయని, ప్రజలు ఇప్పటికే ఎదురు తిరిగారని, అందుకే గవర్నర్ కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటున్నారని సమాచారం.

<strong>జయలలిత మేనకోడలు దీపాకు మంత్రి పదవి ! శశికళ పని ఫినిష్</strong>జయలలిత మేనకోడలు దీపాకు మంత్రి పదవి ! శశికళ పని ఫినిష్

AIADMK’s legislative party leader Chinnamma VK Sasikala Natarajan and her family members

మన్నార్ గుడి ఫ్యామిలీ నాయకురాలు అంటూ గుర్తింపు తెచ్చుకున్న శశికళ, ఆమె కుటుంబ సభ్యుల మీద అనేక కేసులు నమోదు అయ్యాయి. అన్ని కేసులు విచారణలో ఉన్నాయి. విదేశీ నగదు అక్రమ లావాదేవీలు జరిపారని ఆరోపిస్తూ 1996లో శశికళ, ఆమె సమీప బంధువును పోలీసులు అరెస్టు చేశారు.

ఈ కేసులో మూడు న్యాయస్థానాల్లో శశికళ, ఆమె బంధువు నిర్దోషిగా బయటకు వచ్చారు. అయితే ఈడీ అధికారులు మళ్లీ మద్రాస్ హై కోర్టులో అప్పీలు చేశారు. మద్రాస్ హైకోర్టు ఆదేశాల మేరకు మళ్లీ కేసు విచారణకు వచ్చింది. ఇటీవల విదేశీ నగదు అక్రమ లావాదేవీలు నిర్వహించారని మద్రాస్ హై కోర్టు స్పష్టం చేసింది.

ఈ కేసు విషయంపై శశికళ బంధువు సుప్రీం కోర్టును ఆశ్రయించాలని నిర్ణయించారు. 1991 -1996 మద్య కాలంలో జయలలిత ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రూ. 66 కోట్ల అక్రమ ఆస్తులు సంపాధించారని కేసు నమోదు అయ్యింది.

ఈ కేసులో శశికళ నటరాజన్ ఎ-2 ముద్దాయి. ఈ కేసు తీర్పు సుప్రీం కోర్టులో పెండింగ్ లో ఉంది. అయితే శశికళ మాత్రం తాను సీఎం అయిపోవాలని ప్రయత్నిస్తున్నారని ప్రతిపక్షలు మండిపడుతున్నాయి. 1990లో జయలలిత పోయెస్ గార్డెన్ నుంచి శశికళ భర్త నటరాజన్ ను మెడపట్టి గెంటేశారు.

<strong>ఎమ్మెల్యేలు గోడ దూకేస్తున్నారు: పన్నీర్, శశికళ ఎత్తులు పై ఎత్తులు</strong>ఎమ్మెల్యేలు గోడ దూకేస్తున్నారు: పన్నీర్, శశికళ ఎత్తులు పై ఎత్తులు

తరువాత అనేక ప్రాంతాల్లో నటరాజన్ భూ కబ్జాలు చేశారాని ఆరోపణలు వచ్చాయి. తంజావూరులో 20 ఎకరాల స్థలాన్ని నటరాజన్ కబ్జా చేశారని ఆరోపణలు రావడంతో కేసు నమోదు అయ్యింది. అదే సందర్బంలో నటరాజన్ ను పోలీసులు అరెస్టు చేసి జైలుకు పంపించారు.

మన్నార్ గుడి గ్యాంగ్ లీడర్ అని పేరుతెచ్చుకున్న శశికళ కుటుంబ సభ్యులు అనేక మంది మీద కేసులు నమోదు అయ్యాయి. శశికళ సోదరుడు దివాకరన్ ప్రతిపక్షం అయిన డీఎంకే మద్దతుదారుల మీద హత్యాయత్నం చేశారని కేసులు నమోదు కావడంతో 2012లో జయలలిత ఆయన్ను అరెస్టు చెయ్యాలని ఆదేశాలు జారీ చేశారు.

దివాకరన్ ను అరెస్టు చేసి జైలుకు పంపించారు. తిరువరూరులో అక్రమంగా క్వారీలు నిర్వహిస్తున్నారని, అక్కడే పలు ఎకరాల భూములు కబ్జా చేశారని కేసులు నమోదు అయ్యాయి. శశికళకు అతి సమీప బంధువులైన దినకరన్, టీవీటీ భాస్కరన్, ఆర్. రావణన్ ల మీద అనేక కేసులు నమోదు అయ్యాయి. శశికళ ఫ్యామిలీ సభ్యులు అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్నారు.

English summary
Tamil Nadu is all set to get a woman Chief Minister for the third time with VK Sasikala Natarajan being elected as the AIADMK's legislative party leader. But her fate is yet to be decided by the court. We give you details of what she and her family members are accused of.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X