వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలిత కోసం గుండెలు బాదుకున్నారు (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

చెన్నై/బెంగళూరు: అక్రమ ఆస్తుల కేసులో అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకు శిక్ష విధించడంపై ఐదో రోజైన బుధవారం కూడా రాష్ట వ్య్రాప్తంగా నిరసన ప్రదర్శనలు కొనసాగాయి. తమ నాయకురాలికి శిక్ష విధించడంపై ఆవేదనతో రాష్ట్రంలో మరోవ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు.

నాగపట్నం సమీపంలోని ఊర్కుతి గ్రామంలో తన ఇంట్లో మూడు రోజుల క్రితం విషం తాగి ఆత్మహత్యకు యత్నించిన 55 ఏళ్ల రైతు బుధవారం నాగపట్నం ఆస్పత్రిలో మృతి చెందినట్లు పోలీసులు చెప్పారు. దీంతో అమ్మ అని తాము ఆప్యాయంగా పిలుచుకునే జయలలితకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించడాన్ని భరించలేక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఫ్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 19కు చేరుకుంది.

జయలలిత బెయిలు పిటిషన్‌ను కర్నాటక హైకోర్టు వెకేషన్ బెంచ్ బుధవారం విచారించేలా చేయడంలో ఆమె తరఫు లాయర్ల బృందం సఫలీకృతం కావడంతో తమ నాయకురాలు జైలునుంచి విడుదలవుతారని అన్నాడీఎంకే కార్యకర్తల్లో ఆశలు చిగురించినప్పటికీ విచారణకు చేపట్టిన కొద్ది సేపటికే జడ్జి కేసును వాయిదా వేయడంతో నిరాశకు గురయ్యారు.

కోయంబత్తూరులో ఆందోళన

కోయంబత్తూరులో ఆందోళన

దీంతో బుధవారం కూడా చెన్నైతో పాటుగా రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో కూడా ఆందోళనలు కొనసాగాయి. తమ నాయకురాలిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ పార్టీ కార్యకర్తలు బ్యానర్లు, ప్లకార్డులను ప్రదర్శిస్తూ ఆందోళనలు చేపట్టారు.

 బెంగళూరులో ధర్నా

బెంగళూరులో ధర్నా

చెన్నైలో పార్టీ వివిధ విభాగాలు చేపట్టిన ఆందోళన కార్యక్రమాల్లో అన్నాడీఎంకే విద్యార్థి విభాగం కూడా పాలు పంచుకుంది. పార్టీ ఐటి విభాగం చెన్నైలోని అన్నాడీఎంకే ప్రదాన కార్యాలయం ముందు మానవ హారం ఏర్పాటు చేసింది.

 కోయంబత్తూరులో ఆందోళన

కోయంబత్తూరులో ఆందోళన

తమ నాయకురాలిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ తిరుచిరాపల్లిలో అణ్ణాదురై విగ్రహం వద్ద పార్టీ కార్యకర్తలు జరుపుతున్న నిరాహార దీక్షలు బుధవారం అయిదో రోజు కూడా కొనసాగాయి.

 కోయంబత్తూరులో ఆందోళన

కోయంబత్తూరులో ఆందోళన

నామక్కల్‌లో కేబుల్ టీవీ ఆపరేటర్ల సంఘం, ఇటుక బట్టీల యజమానుల సంఘం, అన్నాడీఎంకే అనుబంధ కార్మిక సంఘాల ప్రతినిధులు కూడా నిరాహార దీక్షలు చేపట్టారు. కాగా, జయలలితకు నాలుగేళ్ల జైలు శిక్ష విధించడాన్ని భరించలేక రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో ఫ్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 19కు చేరుకుంది.

కోయంబత్తూరులో ఆందోళన

కోయంబత్తూరులో ఆందోళన

అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత అరెస్టు నేపథ్యంలో కోయంబత్తూరులో ఆందోళన చేస్తున్న కార్యకర్తలు.

 లాయర్లు

లాయర్లు

అన్నాడీఎంకే అధినేత్రి, తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత తరఫు న్యాయవాదులు బెంగళూరు న్యాయస్థానం వద్ద మాట్లాడుతున్న దృశ్యం.

English summary
AIADMK Student wing activists sit on a hunger strike protesting against AIADMK chief Jayalalitha's conviction in a disproportionate assets case by Bangalore court in Coimbatore on Wednesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X