వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

జయలలిత మేనకోడలు దీపాకు జేజేలు, శశికళకు శాపనార్థాలు

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి. అన్నాడీఎంకేలోని ద్వితీయ, తృతీయ స్థాయి నేతలు అందరూ ఇప్పుడు నెచ్చెలి శశికళను చీదరించుకుంటున్నారు. ఆమెకు ఏ అర్హత ఉందని అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శిగా నియమించారు అని ప్రశ్నిస్తున్నారు.

<strong>శశికళకు ఎదురు దెబ్బ: మీరు సీఎం కాలేరు, ఎమ్మెల్యే రాజీనామా !</strong>శశికళకు ఎదురు దెబ్బ: మీరు సీఎం కాలేరు, ఎమ్మెల్యే రాజీనామా !

మీకు ఓట్లు వేయాలంటే మేము కావాలి, మీరు నిర్ణయం తీసుకునే ముందు మా మాటలకు విలువ ఇవ్వరా ? అని నాయకులను నిలదీస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో మీరు ఎలా గెలుస్తారో చూస్తాం అంటూ హెచ్చరిస్తున్నారు.

<strong>ఎంత ధైర్యం: పన్నీర్ సెల్వంకు మన్నార్ గుడి మాఫియా వార్నింగ్ !</strong>ఎంత ధైర్యం: పన్నీర్ సెల్వంకు మన్నార్ గుడి మాఫియా వార్నింగ్ !

ఈ దెబ్బతో అన్నాడీఎంకే నాయకులు అయోమయంలో పడిపోయారు. చిన్నమ్మను కాదంటే పదవి ఊడిపోతుందని, అలాగని కార్యాకర్తలను కాదంటే రాజకీయ భవిష్యత్తు శూన్యం అయిపోతుందని ఆందోళన చెందుతున్నారు.

<strong>శశికళ VS స్టాలిన్: వార్ వన్ సైడ్, పాపం చిన్నమ్మ !</strong>శశికళ VS స్టాలిన్: వార్ వన్ సైడ్, పాపం చిన్నమ్మ !

పోటెత్తి వస్తున్న కార్యకర్తలు

పోటెత్తి వస్తున్న కార్యకర్తలు

జయలలిత మేన కోడలు దీపా జయకుమార్ రాజకీయాల్లోకి రావాలని రోజురోజుకు పెద్ద ఎత్తున కార్యకర్తలు డిమాండ్ చేస్తున్నారు. అన్నాడీఎంకే పార్టీకి మీరే వారసులు కావాలని దీపాకు మనవి చేస్తున్నారు.

అచ్చం అమ్మాలాగే ఉన్నావు తల్లి

అచ్చం అమ్మాలాగే ఉన్నావు తల్లి

అచ్చం జయలలితను చూస్తున్నట్లే ఉందని, మీరు ఇప్పుడు మాకు పెద్ద దిక్కుగా నిలవాలని అన్నాడీఎంకే పార్టీకి చెందిన మహిళా కార్యాకర్తలు దీపాకు మనవి చేస్తున్నారు. మిమ్మల్ని చూస్తుంటే అమ్మ లేని లోటు తీరుందని అంటున్నారు.

దీపాకు జేజేలు, శశికళకు శాపనార్థాలు

దీపాకు జేజేలు, శశికళకు శాపనార్థాలు

జయలలిత మేనకోడలు నివాసం ఉంటున్న చెన్నైలోని టీ నగర్ కు అన్నాడీఎంకే కార్యకర్తలు క్యూకడుతున్నారు. ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు టీ నగర్ చేరుకోవడంతో ఆ పరిసర ప్రాంతాలు పాదచారులు, వాహనచోదకులతో కిటకిలాడుతున్నాయి.

మీ మాటను గౌరవిస్తాను

మీ మాటను గౌరవిస్తాను

అన్నాడీఎంకే కార్యకర్తలు పెద్ద సంఖ్యలో ఇంటి దగ్గరకు రావడంతో దీపా జయకుమార్ బాల్కనీ నుంచి కార్యకర్తలకు అభివాదం చేస్తున్నారు. అచ్చం జయలలితలాగే ఉండే దీపా అమ్మ లాగే రెండు వేళ్లు పైకి చూపించి కార్యకర్తలకు అభివాదం చేస్తున్నారు. జయలలిత లాగే అందరికి నమస్కారం చేస్తున్నారు.

శశికళ వర్గీయులు అక్కడే

శశికళ వర్గీయులు అక్కడే

మన్నార్ గుడి మాఫియా గ్యాంగ్ లోని కొందరు నాయకులు వారి కార్యకర్తలను దీపా నివాసం ఉంటున్న టీ నగర్ కు పంపించి ఏమి జరుగుతుందో చూడండి ? అంటూ ఆదేశాలు జారీ చేశారు. మన్నార్ గుడి మాఫియా కార్యకర్తలు ఇప్పుడు దీపా అభిమానులలో కలిసిపోయి ఎప్పుడు ఏమి జరుగుతుందో అనే పూర్తి విషయాలు గమనించి నాయకులు సమాచారం ఇస్తున్నారు.

ఆరా తీస్తున్న డీఎంకే

ఆరా తీస్తున్న డీఎంకే

శశికళకు వ్యతిరేకంగా కార్యకర్తలు ప్రత్యక్షంగా ఎదురు తిరగడంతో ఎప్పుడు ఏమి జరుగుతుందో అని ప్రతిపక్ష పార్టీ డీఎంకేకి చెందిన నాయకులు గమనిస్తున్నారు. అన్నాడీఎంకే పార్టీ చీఫ్ గా బాధ్యతలు స్వీకరించిన రోజే మా నాయకుడు స్టాలిన్ ను విమర్శించిన శశికళకు తగిన బుద్ది చెప్పాలని డీఎంకే పార్టీ నాయకులు సమయం కోసం ఎదురు చూస్తున్నారు.

సంక్రాంతి రోజు దీపా కీలక నిర్ణయం

సంక్రాంతి రోజు దీపా కీలక నిర్ణయం

తమిళ సోదరులకు సంక్రాంతి పండగ చాల ముఖ్యమైనది. తమిళ ప్రజలు మంచి నిర్ణయం తీసుకోవాలంటే సంక్రాంతి పండగ రోజుకు ప్రాధాన్యత ఇస్తారు. అదే రోజు దీపా సంచలన నిర్ణయం తీసుకుంటారని దీపా పేరవై సంస్థ నాయకులు అంటున్నారు. తమిళనాడు ప్రజలు అందరూ జయలలిత మేనకోడలు దీపా ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు అని వేచి చూస్తున్నారు.

English summary
Tamil Nadu: J Deepa the daughter of Jayalalitha's brother Jayakumar has declared that she will definetley enter into the politics soon.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X