sasikala aiadmk protest against tamil nadu dmk ministers శశికళ ఏఐఏడీఎంకే వ్యతిరేకంగా తమిళనాడు డీఎంకే మంత్రులు
శశికళకు సెగ: తమిళనాడులో‘సొంత పార్టీ’ఆందోళనలు
చెన్నై: అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శిగా శశికళ నటరాజన్ ఎన్నికైన సందర్బంగా ఆమె రాజకీయాల్లో ఎలా ముందుకు వెలుతారు ? అంటే ఏమో ? ఆదేవుడికే తెలియాలి అంటున్నారు ఆ పార్టీ కార్యకర్తలు.
వంద మంది నాయకులు శశికళను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారని, కోట్ల మంది కార్యకర్తలు, అమ్మ అభిమానుల అభిప్రాయాలను గాలికి వదిలేశారని మండిపడుతున్నారు. ఎవరు ఎంపీలు కావాలి ? ఎవరు ఎమ్మెల్యేలు కావాలి అని మేము నిర్ణయించి ఓట్లు వేస్తామని కార్యకర్తలు గుర్తు చేస్తున్నారు.
వామ్మో శశికళ: 'ఆయా నుంచి అన్నాడీఎంకే'చీఫ్ అయ్యారు
అయితే మా ఓట్లతో ఎన్నుకోబడిన నాయకులు మా మాటలు గాలికి వదిలేసి ఇప్పుడు వారికి ఇష్టం వచ్చినట్లు ప్రవర్థిస్తున్నారని, నిర్ణయాలు తీసుకుంటున్నారని అసహనం వ్యక్తం చేస్తున్నారు. అమ్మ పోయి నెలకాక ముందు ఆమెను మరిచిపోయి చిన్నమ్మా చిన్నమా అంటు భజన చేస్తున్నారని మండిపడుతున్నారు.

అన్నాడీఎంకే పార్టీని, తమిళనాడును నాశనం చెయ్యడానికి నెచ్చెలి శశికళకు పార్టీ ప్రధాన కార్యదర్శిగా నియమించారని ఆరోపిస్తూ సొంత పార్టీ నాయకులు, కార్యకర్తలు తమిళనాడులో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.
టార్గెట్ శశికళ: ఏ పదవి తీసుకున్నా ఐటీ దాడులు గ్యారెంటీ!
వెంటనే శశికళను అన్నాడీఎంకే పార్టీ ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ రోడ్ల మీద కుర్చుని ధర్నాలు చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇలాగే ఉంటే డీఎంకే పార్టీ అధికారంలోకి వచ్చినా ఆశ్చర్యం లేదని అంటున్నారు.

శశికళ అంటే గిట్టని వారే ఇలా రాజకీయం చేస్తూ అమాయకుల దగ్గర ఆందోళనలు చేయిస్తున్నారని చిన్నమ్మ వర్గీయులు ఆరోపిస్తున్నారు. మొత్తం మీద శశికళకు వ్యతిరేకంగా అప్పుడే తమిళనాడులో ఆందోళనలు మొదలైనాయి.