వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యూపీలో కాంగ్రెస్ పార్టీ ప్రక్షాళన... ప్రశ్నార్థకంగా మారిన ప్రియాంకా భవితవ్యం

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ఉత్తర్‌ప్రదేశ్‌లో పార్టీ ప్రక్షాళణ చేపట్టింది అఖిల భారత కాంగ్రెస్ కమిటీ. ఇందులో భాగంగా యూపీలోని అన్ని జిల్లాల కమిటీలను రద్దు చేసింది ఏఐసీసీ. ఇక ఉపఎన్నికలు జరిగే స్థానాల్లో అక్కడి పరిస్థితులను సమీక్షించేందుకు ఇద్దరితో కమిటీ వేసింది కాంగ్రెస్ పార్టీ. ఇదిలా ఉంటే ఉత్తర్‌ప్రదేశ్ తూర్పులో కొన్ని విభాగాలకు ఇంఛార్జీలను కాంగ్రెస్ శాసనసభాపక్షనేత అజయ్ కుమార్ లల్లు మార్చారన్న ఆరోపణలు వచ్చాయి. ఉత్తర్ ప్రదేశ్‌ వెస్ట్‌లో కూడా మార్పులు చేర్పులను పార్టీ జనరల్ సెక్రటరీ నిర్ణయిస్తారని కాంగ్రెస్ తెలిపింది.

ఏఐసీసీ తీసుకున్న నిర్ణయంతో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీలుగా ఉన్న ప్రియాంకా గాంధీ, జ్యోతిరాదిత్య సిందియా భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.లోక్‌సభ ఎన్నికలకు ముందు తూర్పు యూపీ ప్రధాన కార్యదర్శిగా ప్రియాంకా గాంధీ, పశ్చిమ ఉత్తర్ ప్రదేశ్‌ ప్రధాన కార్యదర్శిగా జ్యోతిరాదిత్య సింధియాలను కాంగ్రెస్ నియమించింది. అంతేకాదు సిందియాకు 38 లోక్‌సభ స్థానాల బాధ్యత అప్పగించగా.. అక్కడ ఒక్క సీటు కూడా కాంగ్రెస్ గెలవలేకపోయింది.

Recommended Video

మోదీ నాయకుడు కాదు గొప్ప నటుడు - ప్రియాంక గాంధీ
AICC dissoves Poll committee in Uttar Pradesh, questions raise on Priyankas political future

ప్రియాంకా గాంధీకి తూర్పు ఉత్తర్‌ప్రదేశ్‌లో 42 స్థానాలు బాధ్యత అప్పగించగా... సోనియాగాంధీ పోటీచేసిన రాయ్‌బరేలీ సీటు మాత్రమే కాంగ్రెస్ ఖాతాలో పడింది. ఇక్కడ కూడా ప్రియాంకా గాంధీ మంత్ర ఫలించలేదు. ఇక అంతకుముందు కర్నాటక ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీని కూడా ఏఐసీసీ రద్దు చేసింది. అయితే కర్నాటక పార్టీ చీఫ్ దినేష్ గుండురావు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఈశ్వర్‌ల స్థానాల్లో ఎలాంటి మార్పు ఉండదని స్పష్టం చేసింది కాంగ్రెస్. మిగతా వారినందరిని మార్చే యోచనలో కాంగ్రెస్ ఉంది.

English summary
The All India Congress Committee on Monday dissolved all district committees of the party in Uttar Pradesh.A two-member committee has been formed to oversee preparations and management for each seat going in for bypoll.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X