వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బీజేపీ ఎందుకు ఓడిపోతుంది అంటే, మోడీ నోట్లో ఆ పేరు రాదు, రాహుల్ గాంధీ ఫైర్!

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: కర్ణాటక శాసన సభ ఎన్నికల ప్రచారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ప్రధాని నరేంద్ర మోడీతో సహ బీజేపీ నాయకుల మీద తీవ్రస్థాయిలో విమర్శించారు. బీజేపీ ఎందుకు ఓడిపొతుంది అనే విషయంపై రాహుల్ గాంధీ వివరణ ఇచ్చారు. మోడీ నోట్లో ఆ పేరురాదని, బీజేపీకి ఇక భవిష్యత్తులేదని రాహుల్ గాంధీ జోస్యం చెప్పారు.

కన్నడ బాష

కన్నడ బాష

బుధవారం కర్ణాటకలోని చిత్రదుర్గ జిల్లా హోళెల్కెరేలో కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ఎన్నికల ప్రచారం సందర్బంగా ఏర్పాటు చేసిన జనాశీర్వాద బహిరంగ సభకు హాజరైన రాహుల్ గాంధీ కన్నడలో మాట్లాడుతూ ఎల్లరుగూ నమస్కారా (అందరికీ నమస్కారం) అన్నారు.

బీజేపీ ఓడిపోతుంది

బీజేపీ ఓడిపోతుంది

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన రాహుల్ గాంధీ ఎన్నికల ప్రచారం ఎలా జరుగుతోందని, బీజేపీ ఓడిపోతుందా లేదా గట్టిగా చెప్పండి అని అన్నారు. బీజేపీ ఎందుకు ఓడిపోతుందో తాను మీకు వివరిస్తానని రాహుల్ గాంధీ చెప్పారు.

తప్పుడు వాగ్దానాలు

తప్పుడు వాగ్దానాలు

బీజేపీ నాయకులు తప్పుడు వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వస్తారని, తరువాత చెప్పింది ఒక్కటీ చెయ్యరని రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎప్పుడు అపద్దాలు చెప్పే బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కర్ణాటకలో పచ్చి నిజాలు మాట్లాడుతున్నారని రాహుల్ గాంధీ అన్నారు.

సీఎం అభ్యర్థి

సీఎం అభ్యర్థి

బీజేపీ కర్ణాటక సీఎం అభ్యర్థి బీఎస్ యడ్యూరప్పను పక్కనే కుర్చోపెట్టుకున్న అమిత్ షా దేశంలోనే ఈయనంత అవనీతి పరుడుడు ఇంకోకరు ఉండరని నిజం మాట్లాడారని రాహుల్ గాంధీ చెప్పారు. యడ్యూరప్ప అధికారంలో ఉన్న సమయంలో తీవ్రస్థాయిలో అవినీతికి పాల్పడి జైలుకు వెళ్లి వచ్చారని రాహుల్ గాంధీ ఆరోపించారు.

మోడీ ఏం తక్కువా !

మోడీ ఏం తక్కువా !

ప్రధాని నరేంద్ర మోడీ గంటలు గంటలు ప్రసంగిస్తారని రాహుల్ గాంధీ ఎద్దేవ చేశారు. అయితే దేశ ప్రజలకు చెందిన రూ. 30 వేల కోట్లు లూటీ చేసి విదేశాలకు పారిపోయిన నీరవ్ మోడీ గురించి ఒక్క నిమిషం కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఎక్కడా మాట్లాడలేదని రాహుల్ గాంధీ విమర్శించారు. ఈ బహిరంగ సభ సమావేశంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్యతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు.

English summary
AICC President Rahul Gandhi addressed Janashirvada yatre rally in Holalkere, Chitradurga on April 04, 2018. Rahul Gandhi in Karnataka for two days of campaign for Karnataka assembly elections 2018.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X